
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరంలో చోటుచేసుకుంది. ఉల్లాల అష్రాఫ్ అనే వ్యక్తికి చెందిన పడవ ఆదివారం వేకువజామున చేపల రేవు నుంచి అరేబియా సముద్రంలోకి వేటకు బయల్దేరింది.
ఈ బోట్‌లో 10 మంది తమిళనాడుకు చెందిన మత్య్సకారులు ఉన్నారు. డ్రైవరుతో పాటు ఐదుగురు మద్యం తాగారు. డ్రైవర్ మత్తులో మరో వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించాడు. ఈ గందరగోళంలో బోటు సముద్రం ఒడ్డుకు దూసుకొచ్చి రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
(చదవండి: 74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత)
Comments
Please login to add a commentAdd a comment