Banasankari
-
ప్రకృతి ఒడిలో అలజడి.. టూరిస్ట్ స్పాట్లో చీకటి ఉదంతాలు!
బనశంకరి: కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా చార్మాడీ ఘాట్ ప్రకృతి అందాలకు నిలయం ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామం. పర్వతాలు, లోయలు పచ్చగా, పొగమంచుతో అద్భుతం అనిపిస్తాయి. కానీ ఇటీవల వేర్వేరు కారణాలతో హాట్‌టాపిక్‌గా మారుతోంది. దుండగులు ఎక్కడో హత్యలు చేసి ఆ మృతదేహాలను తీసుకువచ్చి చార్మాడీ ఘాట్‌లో పడేసి వెళ్లడం పెరిగింది. దీని వల్ల కేసుల విచారణ కష్టమవుతుంది. మరోపక్క పర్యాటకులు ఇక్కడ ప్రమాదకర స్థలాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. సాయంత్రం కాగానే.. చార్మాడీఘాట్‌లో 28 కిలోమీటర్లు విల్లుపురం–మంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని వెళుతుంది. ఈ మార్గంగా నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తుంటాయి. ఎత్తైన పర్వతాలతో కూడిన ఘాట్‌లో సాయంత్రం తరువాత వాహనాల సంచారం తక్కువై నిర్మానుష్యమవుతుంది. ఈ సమయంలో నేర ముఠాలు మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ప్రకృతి సోయగాలకు నిలయమైన చార్మాడీఘాట్‌కు రక్తపు మరకలు అంటిస్తున్నారు. పనిచేయని సీసీ కెమెరాలు.. కొట్టిగేహార అటవీశాఖ చెక్‌పోస్టులో అమర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ఘాట్‌లోకి ప్రవేశించే చెక్‌పోస్టులో వాహనాల తనిఖీ నామమాత్రమే. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవారికి ఘాట్ స్వర్గధామంగా తయారైంది. హంతకులు జంకు లేకుండా వాహనాల్లో మృతదేహాలను తీసుకొచ్చి వదిలేస్తుంటారు. ఇదే కాదు కొన్ని వాహనాల డ్రైవర్లు మృతిచెందిన పందులు, కోళ్లను ఇదే ఘాట్ రోడ్డులో పడేస్తున్నారు. అడ్డుకట్టకు చర్యలు చేపడతాం: ఎస్పీ కొట్టిగుహర, చార్మాడీ గ్రామాల్లో చెక్‌పోస్టుల్లో పగలూ రాత్రి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కాగా, ఘాట్‌లో మృతదేహాలు లభిస్తున్నట్లు తెలిసింది, సంఘ సంస్థలు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించి నియంత్రణ గురించి చర్చిస్తాం, చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాలు అమర్చడానికి చర్యలు తీసుకుంటామని దక్షిణ కన్నడ ఎస్పీ ఉమాప్రశాంత్ తెలిపారు. ఎన్నో చీకటి ఉదంతాలు 2008 జూన్ 11 తేదీన శివగంగమ్మ అనే మహిళ మృతదేహాన్ని పడేశారు. 2012లో వజ్రాల వ్యాపారిని బెంగళూరులో హత్యచేసి చార్మాడీ కనుమలో వేశారు. అదే ఏడాది అల్దూరిలో ఒక డాక్టరు స్పృహలేని స్థ్దితిలో కనబడ్డారు. 2013 జూన్ 21 న మలయమారుత వద్ద శివమొగ్గ మంగోటి గ్రామ మమతా, 2016లో చెన్నరాయపట్టణ కాంత అనే మహిళల మృతదేహాలు సోమనకాడు వద్ద కనిపించాయి. 2020లో చార్మాఢీఘాట్ రోడ్డులోని కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత ఏడాది డబ్బు విషయంపై చిక్కబళ్లాపుర శరత్ అనే వ్యక్తిని హత్యచేసి చార్మాడి ఘాట్‌లో విసిరేశారు. ఇలా అనేక హత్యల్లో మృతదేహాలను పడవేసి ఈ ప్రాంతమంటే భయాందోళన కలిగించే దుస్థితిని తెచ్చారు. ఆచూకీ లేని అనేక మృతదేహాలు ఇక్కడి నేలలో లీనమౌతున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. సెల్ఫీ ప్రమాదాలు అలెకాన్ జలపాతం, ఆలయం వద్ద సెల్పీ తీసుకోవడానికి వెళ్లి పలువురు మృత్యవాత పడ్డారు. 2015 సెప్టెంబరులో హండుగళి మహేంద్ర, 2016 జనవరి 18 చిత్రదుర్గ కు చెందిన హనుమంతప్ప(34), నాగభూషణ్ (28) ప్రాణాలు కోల్పోయారు. -
కన్నీరు తెప్పించే డెత్‌నోట్: అంతేసి ఫీజులు కట్టి.. నరకంలో పడేశారు
బనశంకరి: ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్ వార్డెన్ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుళ దంపతుల కుమారుడు పూర్వజ్ (14) ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్ తల్లి మంజుళ పుట్టిన రోజు. తల్లితో ఒకసారి మాట్లాడతానని, మొబైల్ ఇవ్వాలని బాలుడు హాస్టల్ వార్డెన్‌ను కోరగా, అందుకు వార్డెన్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్ శనివారం రాత్రి 12 గంటల వరకు ఒంటరిగా గడిపాడు. తరువాత డెత్‌నోట్ రాసి హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు. చదవండి: (Telangana: ఆకాశంలో అద్భుతం) కన్నీరు తెప్పించే డెత్‌నోట్ ఆదివారం ఉదయం పూర్వజ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే హాస్టల్లో కలకలం చెలరేగింది. బాలుని ఆత్మహత్యకు విద్యా సంస్థ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెనే కారణమని మంజుళ సోదరుడు అరుణ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెత్‌నోట్‌లో.. ‘‘అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి.. మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు.’’ అని బాలుడు రాసిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బిడ్డకు ప్రాణం పోసి తల్లి మరణం..!
బనశంకరి: కరోనా మహమ్మారి గర్భంలోని బిడ్డను– తల్లిని వేరు చేసింది. వైద్యుల చొరవతో కడుపులోని బిడ్డ ప్రాణాలతో బయటపడింది కానీ, ఆ తల్లికి బిడ్డను చూసుకునే అదృష్టం లేకుండా పోయింది. ఈ ఘటన బెంగళూరు శివాజీనగర బౌరింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురకు చెందిన అశ్విని అనే 8 నెలల నిండు గర్భిణి (27)కి కరోనా పాజిటివ్ రాగా, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంది. నాలుగు రోజుల తరువాత శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు దొడ్డబళ్లాపుర ఆసుపత్రికి, అక్కడి నుంచి బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటికి తీసి వెంటిలేటర్లో ఉంచారు. మూడురోజుల తరువాత తల్లి అశ్విని సోమవారం రాత్రి మృతి చెందింది. (చదవండి: Coronavirus: ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు..!) -
డ్రంక్ అండ్ డ్రైవ్... పడవ పల్టీ
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరంలో చోటుచేసుకుంది. ఉల్లాల అష్రాఫ్ అనే వ్యక్తికి చెందిన పడవ ఆదివారం వేకువజామున చేపల రేవు నుంచి అరేబియా సముద్రంలోకి వేటకు బయల్దేరింది. ఈ బోట్లో 10 మంది తమిళనాడుకు చెందిన మత్య్సకారులు ఉన్నారు. డ్రైవరుతో పాటు ఐదుగురు మద్యం తాగారు. డ్రైవర్ మత్తులో మరో వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించాడు. ఈ గందరగోళంలో బోటు సముద్రం ఒడ్డుకు దూసుకొచ్చి రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. (చదవండి: 74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత) -
రూ. 250 భోజనం ఆర్డర్.. 50 వేలు మాయం
బనశంకరి: ఫేస్బుక్లో ప్రకటనను నమ్మి ఓ మహిళ రూ.50 వేలు పోగొట్టుకున్న ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. కనకపుర రోడ్డు యలచేనహళ్లి నివాసి సవితాశర్మా మంగళవారం ఫేస్బుక్లో రూ.250 విలువ చేసే ఒక దాలి ఆర్డర్ చేస్తే రెండు దాలి ఉచితంగా ఇస్తామని ప్రకటన గమనించింది. భోజనం ఆర్డర్ చేయడానికి ప్రకటనలో నమోదుచేసిన నెంబరుకు ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఆర్డర్ చేయడానికి ముందు రూ.10 చెల్లించాలని, అనంతరం భోజనం ఇంటికి సరఫరా చేసిన అనంతరం మిగిలిన నగదు చెల్లించవచ్చునని అవతలి వ్యక్తి తెలిపాడు. అనంతరం ఫారం భర్తీ చేయాలని సవితాశర్మా మొబైల్‌కు లింక్ పంపించాడు.(చదవండి: చెల్లి కోసం తల్లిని చంపిన తనయుడు) ఈ ఫారంలో ఆమె డెబిట్‌కార్డు వివరాలు, పిన్ నెంబరును నమోదుచేసింది. తక్షణం కొద్దిక్షణాల్లో రూ.49,996 నగదు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు సవితాశర్మా మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో గాబరాబడిన బాధితురాలు అదే నెంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అయినట్లు తెలిసింది. మరుసటిరోజు ఆమె సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్బుక్ ప్రకటన కలిగిన రెస్టారెంట్ అడ్రస్ సదాశివనగర అని తెలిసింది. సాధ్యమైనంత త్వరగా వంచకుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
హీరో కాదు.. పోలీసే
బెంగళూరు : బనశంకరి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ అర్జున్ దేహధారుడ్యంపై బెంగళూరు దక్షిణ డీసీపీ అణ్ణామలై ప్రశంసించారు. విరామ సమయంలో జిమ్‌లో వెళ్లి భారీగా కసరత్తులు చేస్తుంటారు అర్జున్. ఒత్తిడితో కూడుకున్న విధుల్లోనూ శ్రద్ధ వహించి సిక్స్ ప్యాక్ దేహదారుడ్యం పెంచిన అర్జున్ ప్రతి పోలీస్‌కు ఆదర్శమని అణ్ణామలై తెలిపారు. ఆటగాడైన అర్జున్ 2014లో కబడ్డీ ఆడుతుండగా కాలు విరిగింది. దీంతో శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది ఈ నేపత్యంలో క్రీడల్లో పాల్గొనడం సాధ్యం కాక జిమ్‌కు వెళ్లి ధారుడ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. అర్జున్ గురించి తెలిసన డీసీపీ అణ్ణామలై ప్రోత్సహించారు. ఇప్పుడు అర్జున్ సిక్స్‌ప్యాక్ ఫోటో వైరల్ అవుతోంది. -
సహ ఉద్యోగిని హత్య చేసిన జవాన్లు
బనశంకరి(కర్ణాటక) : సహ ఉద్యోగిని హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు ఇద్దరు జవాన్లను శుక్రవారం వివేకనగర పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ చంద్రగుప్త తెలిపిన మేరకు వివరాలు...బెంగళూరులోని వివేకనగర ఏఎస్సీ క్యాంపస్ సెంటర్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంకజ్‌కుమార్(26), ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన ధనరాజ్, మురళీకృష్ణ జవాన్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల మురళీకృష్ణకు చెందిన కొన్నిపత్రాలు గల్లంతయ్యాయి. ఈ విషయంలో మురళీకృష్ణ, పంకజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో పంకజ్‌కుమార్‌ను హత్య చేయాలని మురళీకృష్ణ పథకం పన్నాడు. ఈనెల 23న రాత్రి 11 గంటల సమయంలో పంకజ్‌కుమార్ గదిలోకి చొరబడిన మురళీకృష్ణ, అతని సహద్యోగి ధనరాజ్లు దాడికి పాల్పడ్డారు. కాళ్లు చేతులు, ఇతర భాగాలపై కత్తులతో పొడిచి పంకజ్‌కుమార్‌ను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని క్యాంపస్‌కు రాత్రి సమయంలో నీరు తీసుకువచ్చే ట్యాంకర్లో వేసుకుని దుమ్మలూరు గాల్ప్‌కోర్సు వద్దకు తీసుకెళ్లి కాల్చారు. మృతదేహం పూర్తిగా దగ్ధం కాకపోవడంతో మళ్లీ నీటి ట్యాంకర్లో క్యాంపస్ ఆవరణలోకి తెచ్చి చెత్తకుప్పలో పడేశారు. తరువాత గదిలోకి వెళ్లి రక్తపుమరకలను శుభ్రం చేశారు. మృతదేహం దగ్ధం చేసే సమయంలో ధనరాజ్‌కు గాయాలయ్యాయి. దీంతో 24న ధనరాజ్ క్యాంపస్‌లో ఉన్న ఆసుపత్రిలో చేరాడు. ట్రినిటీ సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడినట్లు తెలిపాడు. అతని మాటలు నమ్మదగినవిగా లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో క్యాంపస్ మూలలో సగభాగం కాలిన మృతదేహాం కనబడింది.మరో వైపు జవాన్ పంకజ్‌కుమార్ అదృశ్యమైనట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై క్యాంపస్ అధికారులు వివేకనగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్యాంపస్‌కు చేరుకున్న పోలీసులు అక్కడ పడిఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాం పంకజ్‌కుమార్‌దిగా గుర్తిం చారు. స్పష్టత కోసం పంకజ్‌కుమార్ తల్లిదండ్రులను రప్పించారు. మృతు డు తమవాడేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. దీంతో డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. జాగీలం ధనరాజ్ గదివద్దకు వెళ్లి ఆగిపోయింది. ధనరాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మురళీకృష్ణ తో కలిసి పంకజ్‌కుమార్‌ను హత్యచేసిన ట్లు అంగీకరించాడు. దీంతో ధనరాజ్ ను, మురళీకృష్ణను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. -
ఇద్దరి దారుణహత్య
బనశంకరి: నగరంలో పండుగ రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. ఇంటి ముందు సిగిరెట్ తాగొద్దన్నందుకు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన ఆదివారం వేకువజామున అశోకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...అశోక్‌నగర్ బీ స్ట్రీట్‌కు చెందిన హరీశ్ (31) ఆదివారం తెల్లవారుజామున పల్లకీ ఉత్సవం చూడటానికి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇంటి ముందు నలుగురు వ్యక్తులు సిగిరెట్ తాగుతూ కనిపించారు. సిగిరెట్ దూరంగా వెళ్లి తాగాలని వారికి సూచించాడు. దీంతో వారు అతనితో గొడవపడ్డారు. కొద్దిసేపు అనంతరం మారణాయుధాలతో వచ్చిన దుండగులు హరీశ్‌ను బయటకు లాగి గాయపరిచారు. కుటుంబ సభ్యులను క్షతగాత్రుడిని హుటాహుటిన మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తునఆనరు. గుర్తుతెలియనియువతి దారుణహత్య గుర్తు తెలియని యువతిని దుండగులు దారుణంగా హత్యచేసిన సంఘటన అన్నపూర్ణేశ్వరినగరపోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇక్కడి నాగరబావి ప్రధాన రహదారి ముద్దనపాల్య వద్ద మృతదేహం లభించింది. యువతి జీన్స్ ప్యాంట్ ధరించిందని, తలపై బండరాయితో మోది హత్య చేశారని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. -
టీసీఎస్ సాఫ్ట్వేర్ నిర్వాహకం
శివాజీనగర : నగరంలో మరో లైంగిక దౌర్జన సంఘటన వెలుగు చూసింది. వెలుతున్న బీఎంటీసీ వోల్వో బస్సులో యువతిపై ఓ కామాంధుడు లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన తక్షణమే వెంటాడిన పింక్ హోయ్సళ పోలీసులు బనశంకరిలోని మధుసుధన్‌రావు (47) ను అరెస్టు చేశారు. నిందితుడు టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వివరాలీవి ... ఇబ్లూరు రింగురోడ్డులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బస్సు ప్రయాణిస్తున్న వ్యక్తి ముందు సీట్లో కూర్చున్న 29 సంవత్సరాల వయస్సు కలిగిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. తక్షణమే ఆ యువతి ఇంటర్నెట్లో బెళందూరు పోలీసు ఇన్స్పెక్టర్ నెంబర్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసింది. వెనువెంటనే పింక్ హోయ్సళ వాహనాన్ని ఇన్స్పెక్టర్ విక్టర్ అలర్ట్ చేశాడు. యువతితో సంప్రదిస్తున్న పోలీసులు బస్సు వెళుతున్న మార్గాన్ని చూచి ఆ బస్సును ఆపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుకు కేసు నమోదు చేశారు. ఆ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు కూడా ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. పింక్ హోయ్సళ రంగప్రవేశం చేసి పట్టుకున్నకేసులో ఇదే మొదటిదే.