
బనశంకరి: నగరంలో పండుగ రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. ఇంటి ముందు సిగిరెట్ తాగొద్దన్నందుకు ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన ఆదివారం వేకువజామున అశోకనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...అశోక్‌నగర్ బీ స్ట్రీట్‌కు చెందిన హరీశ్ (31) ఆదివారం తెల్లవారుజామున పల్లకీ ఉత్సవం చూడటానికి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇంటి ముందు నలుగురు వ్యక్తులు సిగిరెట్ తాగుతూ కనిపించారు. సిగిరెట్ దూరంగా వెళ్లి తాగాలని వారికి సూచించాడు. దీంతో వారు అతనితో గొడవపడ్డారు. కొద్దిసేపు అనంతరం మారణాయుధాలతో వచ్చిన దుండగులు హరీశ్‌ను బయటకు లాగి గాయపరిచారు. కుటుంబ సభ్యులను క్షతగాత్రుడిని హుటాహుటిన మల్య ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తునఆనరు.
గుర్తుతెలియనియువతి దారుణహత్య
గుర్తు తెలియని యువతిని దుండగులు దారుణంగా హత్యచేసిన సంఘటన అన్నపూర్ణేశ్వరినగరపోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇక్కడి నాగరబావి ప్రధాన రహదారి ముద్దనపాల్య వద్ద మృతదేహం లభించింది. యువతి జీన్స్ ప్యాంట్ ధరించిందని, తలపై బండరాయితో మోది హత్య చేశారని పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.