
బనశంకరి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అర్జున్
బెంగళూరు : బనశంకరి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అర్జున్ దేహధారుడ్యంపై బెంగళూరు దక్షిణ డీసీపీ అణ్ణామలై ప్రశంసించారు. విరామ సమయంలో జిమ్‌లో వెళ్లి భారీగా కసరత్తులు చేస్తుంటారు అర్జున్. ఒత్తిడితో కూడుకున్న విధుల్లోనూ శ్రద్ధ వహించి సిక్స్ ప్యాక్ దేహదారుడ్యం పెంచిన అర్జున్ ప్రతి పోలీస్కు ఆదర్శమని అణ్ణామలై తెలిపారు. ఆటగాడైన అర్జున్ 2014లో కబడ్డీ ఆడుతుండగా కాలు విరిగింది. దీంతో శస్త్రచికిత్స చేయాల్సివచ్చింది ఈ నేపత్యంలో క్రీడల్లో పాల్గొనడం సాధ్యం కాక జిమ్‌కు వెళ్లి ధారుడ్యాన్ని పెంచుకుంటున్నట్లు తెలిపారు. అర్జున్ గురించి తెలిసన డీసీపీ అణ్ణామలై ప్రోత్సహించారు. ఇప్పుడు అర్జున్ సిక్స్‌ప్యాక్ ఫోటో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment