
బనశంకరి: కరోనా మహమ్మారి గర్భంలోని బిడ్డను– తల్లిని వేరు చేసింది. వైద్యుల చొరవతో కడుపులోని బిడ్డ ప్రాణాలతో బయటపడింది కానీ, ఆ తల్లికి బిడ్డను చూసుకునే అదృష్టం లేకుండా పోయింది. ఈ ఘటన బెంగళూరు శివాజీనగర బౌరింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురకు చెందిన అశ్విని అనే 8 నెలల నిండు గర్భిణి (27)కి కరోనా పాజిటివ్ రాగా, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంది.
నాలుగు రోజుల తరువాత శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు దొడ్డబళ్లాపుర ఆసుపత్రికి, అక్కడి నుంచి బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటికి తీసి వెంటిలేటర్లో ఉంచారు. మూడురోజుల తరువాత తల్లి అశ్విని సోమవారం రాత్రి మృతి చెందింది.
(చదవండి: Coronavirus: ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు..!)