mother child
-
‘అమ్మ’కు అండగా..
సాక్షి, అమరావతి: మాతృత్వం మరో జన్మ. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం వారికి సకాలంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మందులు, పౌష్టికాహారం అందిస్తోంది. మరోవైపు ప్రసూతి మరణాలు మరింతగా తగ్గించడంపైనా వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైరిస్క్ గర్భిణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పింస్తోంది. రాష్ట్రంలో ఏటా 9 లక్షల ప్రసవాలు నమోదవుతుంటాయి. వీరిలో 28 శాతం మంది రక్తహీనత, ఇతరత్రా అనారోగ్య కారణాలతో బాధపడే హైరిస్క్ గర్భిణులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. వీరి ఆరోగ్యంపై నిరంతరం వాకబు చేస్తూ, తల్లీబిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగేలా వైద్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. హైరిస్క్ గర్భిణులను డెలివరీ తేదీకి ముందే ఆస్పత్రులకు తరలించి వైద్యుల సంరక్షణలో ఉంచుతున్నారు. దీంతోపాటు తీవ్ర రక్తహీనతతో బా«ధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తెచ్చారు. గుమ్మం వద్దకే వాహనం ఈ ఏడాది ఆగస్టు నుంచి హైరిస్క్ గర్భిణులను ప్రసవం, ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో తరలించడం ప్రారంభించారు. పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్, ఆశా వర్కర్లు తమ పరిధిలో హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నట్లయితే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ జిల్లా కో–ఆర్డినేటర్‌కు సమాచారం చేరవేస్తారు. సమాచారం అందుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లో వాహనం గర్భిణుల స్వగ్రామంలో వారి గుమ్మం వద్ద పికప్ చేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్తుంది. తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి అనంతరం తిరిగి క్షేమంగా ఇంటి వద్దకు చేరుస్తున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన వారికి ప్రసవానంతరం తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా ఇంటికి తరలిస్తున్నారు. ఇలా ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 3,500 మంది గర్భిణులు సేవలు వినియోగించుకున్నారు. వీరిలో 2,300 మందికిపైగా రక్తహీనత సమస్య ఉండి ఐరన్ సుక్రోజ్, రక్తమార్పిడి కోసం ఆస్పత్రులకు వెళ్లిన వారు ఉన్నారు. గర్భిణులు ఇబ్బంది పడకుండా.. రక్తహీనతతో బాధపడే గర్భిణులు ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్, రక్తమార్పిడి కోసం సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు ఆస్పత్రులకు వెళ్లి రావాలంటే ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక మారు మూల గ్రామాల్లో అయితే ప్రయాణ ఇబ్బందులకు భయపడి గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లడం మానేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రవేశపెట్టింది. హైరిస్క్ గర్భిణులు ఈ సేవలు వినియోగించుకోవాలి. – డాక్టర్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ 3.27 లక్షల మంది బాలింతలు క్షేమంగా ఇంటికి.. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చడం కోసం ఏర్పాటుచేసిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 3,27,289 మంది బాలింతలను క్షేమంగా ఇంటికి చేర్చింది. ఈ సేవల కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రతి లక్ష ప్రసవాలకు ప్రసూతి మరణాల రేటు(ఎంఎంఆర్) 45కు తగ్గింది. ఇదే జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే ఎంఎంఆర్ 76గా ఉంది. -
భలే వీడియో: ఇదే నా ఫ్యామిలీ.. పెళ్లైన 21 ఏళ్లలో 14 మంది పిల్లలతో..
సోషల్ మీడియాలో అంటేనే ఓ స్పెషల్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు ఉండే చోటు. ఇక, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు కొందరు వింత పనులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ తల్లి చేసిన ఫన్నీ వీడియో ఆమెను సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో ఓ మహిళ తన ఫ్యామిలీని పరిచయం చేసింది. ఇందుకోసం కొత్తగా థింక్ చేసింది. తన సంతానమైన 14 మందిని డిఫరెంట్‌గా పరిచయం చేస్తూ వాళ్లు ఏయో సంవత్సరాల్లో జన్మించారో వీడియోలో చెప్పుకొచ్చారు. 21 ఏండ్ల వ్యవధిలో తాను జన్మనిచ్చిన 14 మంది పిల్లలను పరిచయం చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే, ఆమె.. 1996లో 20 ఏండ్ల వయసులో తాను మొదటిగా కూతురుకు జన్మనిచ్చానని ప్రస్తావించారు. ఆపై వరుసగా తన పిల్లలను చూపుతూ వారు ఏ ఏడాదిలో జన్మించారనే వివరాలు పొందుపరిచారు. చివరిగా తాను 42 ఏండ్ల వయసులో 2017లో చిన్న కూతురుకి జన్మనిచ్చానని నవ్వుతూ తెలిపారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటుగా సీరియస్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంత మంది పిల్లల్ని కనడమేంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. Wait for it… pic.twitter.com/jSFyJwPrfh — Yashar Ali 🐘 یاشار (@yashar) January 18, 2023 -
Video: ఆ తల్లికి సాయం కోసం.. సీఎం జగన్
సాక్షి, కాకినాడ: జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ తల్లిని గుర్తించి.. తన కాన్వాయ్‌ను ఆపించి దిగారు. ఆ తల్లి వివరాలు అడిగి తెలుసుకుని.. ఆమె కష్టానికి చలించిపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజకు ఓ కొడుకు ఉన్నాడు. ఆ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయం కోసం ఆమె సీఎం జగన్‌ను కలవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే చంటిబిడ్డను సీఎం కాన్వాయ్‌కు కనిపించేలా ప్రయత్నించింది. అది గమనించిన సీఎం జగన్.. కాన్వాయ్‌ను ఆపించారు. ఆ తల్లీబిడ్డలను పిలిపించుకుని సమస్య తెలుసుకున్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్ధితిని సీఎం జగన్‌కు వివరించి ఆదుకోవాలని తనూజ కోరడంతో ఆయన సత్వరమే స్పందించారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించి.. అప్పటికప్పుడే ఆమెకు సాయం అందేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
బిడ్డను కొట్టి చంపిన కేసులో.. 22 ఏళ్ల గర్భిణి అరెస్టు..!
ఓ రెండేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తారు? కుదురితే అల్లరి లేదా తమ తోటి పిల్లలతో ఆడుకోవడం. అయితే కొన్నిసార్లు తెలియక చేసే తప్పులు పెద్దలకు కోపం తెప్పిస్తాయి. కానీ పిల్లలకు ఏది మంచి! ఏది చెడు! అని చెప్పే బాధ్యత తల్లిదండ్రులది . అంతేకానీ ఇష్టారీతిగా వారిపై దాడి చేస్తే.. ఆ పసిమనసులు తట్టుకుంటాయా..! పాపం, పుణ్యం తెలియని పసి హృదయాలు తిరగబడతాయా..? ముంబై: మహారాష్ట్రలో ఓ మహిళ తన రెండేళ్ల కూతురుని కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై నేహా సోని అనే 22 ఏళ్ల గర్భిణిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం... శనివారం రాత్రి 8 గంటల సమయంలో విరార్ (తూర్పు) లోని ఫూల్‌పాడా నివాసి అయిన నేహా సోని అనే మహిళ తన కుమార్తె నాన్సీని ఇంటి లోపల నీటితో ఆడుకునే సమయంలో కొట్టింది. దీంతో ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. ఆ పాపను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే నాన్సీ మరణించిందని వైద్యులు తెలిపారు. అయితే తాను బిడ్డను కొట్టినట్లు సోనీ ఆసుపత్రికి వారికి చెప్పలేదు. కానీ పొరుగున ఉండే వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించారు. పోస్ట్ మార్టంలో తల, కడుపుపై పలు అంతర్గత గాయాలు అయినట్లు తేలింది. ఆ నివేదిక ఆధారంగా.. సోనీపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్యకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సురేష్ వర్హాడే తెలిపారు. కాగా రిక్షా డ్రైవర్ అయిన సోనీ భర్త ఆ సమయంలో పనికి వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బిడ్డకు ప్రాణం పోసి తల్లి మరణం..!
బనశంకరి: కరోనా మహమ్మారి గర్భంలోని బిడ్డను– తల్లిని వేరు చేసింది. వైద్యుల చొరవతో కడుపులోని బిడ్డ ప్రాణాలతో బయటపడింది కానీ, ఆ తల్లికి బిడ్డను చూసుకునే అదృష్టం లేకుండా పోయింది. ఈ ఘటన బెంగళూరు శివాజీనగర బౌరింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురకు చెందిన అశ్విని అనే 8 నెలల నిండు గర్భిణి (27)కి కరోనా పాజిటివ్ రాగా, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంది. నాలుగు రోజుల తరువాత శ్వాసకోశ సమస్య తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు దొడ్డబళ్లాపుర ఆసుపత్రికి, అక్కడి నుంచి బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె పరిస్థితిని గమనించి శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటికి తీసి వెంటిలేటర్లో ఉంచారు. మూడురోజుల తరువాత తల్లి అశ్విని సోమవారం రాత్రి మృతి చెందింది. (చదవండి: Coronavirus: ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు..!) -
అమ్మతనానికి ఎంత కష్టం!
సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి తల్లి కాకుండానే మృత్యువు కబళిస్తోంది. ఫస్ట్‌వేవ్‌లో వందల మందికి పురుడు పోసి.. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సెకండ్ వేవ్‌లో మాత్రం కనీస రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా పలువురు గర్భిణులు మాతృత్వపు మధురిమల్ని అనుభవించకుండానే కన్నుమూస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 18 మంది గర్భిణులు కరోనా కారణంగా మృతి చెందగా.. తాజాగా శుక్రవారం కోవిడ్ అనుమానంతో పలు ఆస్పత్రుల్లో అడ్మిషన్ దొరక్క మల్లాపూర్‌కు చెందిన నిండుచూలాలు పావని (22) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహమ్మారి కోరల్లో చిక్కుకుని.. వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. సుమారు లక్షన్నర మంది జ్వర పీడితులున్నట్లు గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 50 వేల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే కోవిడ్ నిర్ధారణ అయినవారు 30 వేల వరకు ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు గర్భిణులకు నెలవారీ పరీక్షలు నిర్వహించిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్ కేంద్రాలుగా మారాయి. కోవిడ్ నిర్ధారణ పరీక్షలతో పాటు టీకాల కార్యక్రమంతో బిజీగా మారుతున్నాయి. నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులు వైరస్ బారిన పడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,160 మంది గర్భిణులు వైరస్ బారినపడి గాంధీలో చేరగా...ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే 15 వరకు 299 మంది గర్భిణులు వైరస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందడం కలవరపరుస్తోంది. ప్రస్తుతం గాంధీలో 45 మంది.. గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నాన్‌కోవిడ్ గర్భిణులకు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, నిలోఫర్ సహా పలు ఏరియా ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా.. కోవిడ్ బారిన పడిన గర్భిణులకు మాత్రం గాంధీలో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క ఆస్పత్రిలోనే 45 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది డెలివరీలు జరుగుతున్నాయి. కేవలం 45 రోజు ల్లోనే 299 మంది గర్భిణులు కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వీరే కాకుండా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత కోవిడ్ నిర్ధారణ అయిన 16 మంది ఆ తర్వాత చికిత్స కోసం గాం«దీలో గైనకాలజీ వార్డులో చేరి వైరస్ నుంచి బయటపడ్డారు. గర్భిణులకు ప్రత్యేకంగా 95 పడకలు.. కరోనా వైరస్ బారిన పడిన గర్భిణులకు చికిత్సలు అందించేందుకు గాంధీ గైనకాలజీ విభాగంలో 95 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కోవిడ్ నిర్ధారణ అయిన గర్భిణులంతా ప్రసవం కోసం ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది నుంచి పదిహేను డెలివరీలు చేస్తున్నాం. పది సహజ ప్రసవాలకు పట్టే సమయం.. ఒక్క కోవిడ్ డెలివరీకి పడుతుంది. ఫలితంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగెత్తవద్దు. గాంధీ ఆస్పత్రికి రావాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించబోం. – డాక్టర్ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆస్పత్రి -
కన్నీరే మిగిలి‘నది’
అమ్మా లేమ్మా.. నాన్నా.. చెల్లిని, అమ్మను పైకి లేవమని చెప్పు.. తాతయ్యా.. చెల్లి నాతో ఆడుకోవడానికి రావడం లేదు.. నువ్వయినా పిలువు.. మామయ్య వాళ్ల ఇంటికి వెళదాం.. అంటూ ఆ చిట్టి తల్లి మారం చేస్తుంటే.. ప్రతి గుండె కన్నీటితో ద్రవించింది. చిన్నారి ఎదురుగా పడి ఉన్న తల్లి, చెల్లి.. ఇక రారని చెప్పడానికి గొంతు పెగలక కృష్ణమ్మ మౌనంగా కదిలిపోయింది. తననే నమ్ముకున్న జీవితాలు తన ఒడిలోనే తెల్లారిపోతుంటే.. గుండె పగిలేలా రోదించింది. శనివారం తుళ్లూరు మండలంలో బోరుపాలెం వద్ద పడవ ప్రమాదంలో తల్లీకూతురు మృత్యువాత పడ్డారు. కృష్ణమ్మ ఒడిలో మృత్యుకేక వినిపించింది. నదినే నమ్ముకున్న వారి జీవితం నీటిలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం వేటకొచ్చి నదిలో వలవేస్తే మృత్యువు అందులోకి లాగేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య మాధవి(26), చిన్నకూతరు కావ్య(3)తో కలసి రాయపూడి ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్ద వేటకు వచ్చాడు. చీకటి పడటంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న పడవ వేగంగా వచ్చి వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. భార్య, బిడ్డ నీటిలో మునిగిపోయారు. గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. తుళ్ళూరు రూరల్ : కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నడకుదిటి సైదారాజుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. వేసవి సెలవులు కావడంతో పెద్ద కూతురు జ్యోతిని అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద వదిలి పెట్టాడు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు బోరుపాలెం సమీపంలో రాయపూడి ఇసుక రీచ్‌ను ఆనుకుని ఉన్న లంక రేవు వద్దకు వేటకని బయలుదేరాడు. చిన్న కూతురు కావ్యను పక్కింట్లో వదిలి వెళదామని భార్యాభర్తలు సైదారావు, మాధవి అనుకున్నారు. కావ్య తానూ వస్తానని మారం చేయడం, పిల్లలను పట్టుకెళుతున్నారనే వందతులు రావడంతో తమ వెంట తీసుకెళ్లారు. నదిలో వలవేసి పడవలోనే కాపలా కాస్తుండగా తెల్లవారుజాము కావడంతో ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో రాయపూడి రేవు నుంచి ఇసుక నింపుకునేందుకు నదిలోకి పడవ అటుగా వచ్చింది. పడవ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా వీరు నిద్రిస్తున్న తెప్పను ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ నదిలో పడిపోయారు. కావ్య(3), మా«ధవి(26) నీటిలో మునిగిపోయారు. సైదారావు నీటిలో భార్య, బిడ్డ కోసం గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పడవలోని ఈతగాళ్లు సైదారావును ఒడ్డుకు చేర్చారు. పోలీసుల అదుపులోపడవ నిర్వాహకుడు పడవ నిర్వాహకుడు నాగమల్లేశ్వరరావును ఫిషర్‌మ్యాన్ రాయపూడి సొసైటీ వారు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సుధాకరరావు, ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి నాలుగు పడవల ద్వారా నదిలోకి వెళ్లారు. గజ ఈతగాళ్ల సాయంతో తొలుత కావ్య, కొద్దిసేపటికి మాధవి మృతదేహాలను గుర్తించగలిగారు. ఎన్డీఆర్ఎఫ్ అడిషనల్ ఎస్పీ మధుసూదన్ రెడ్డి రీచ్‌ను పరిశీలించారు. సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జ్యోతికి అండగా ఉంటాం చిన్నారి జ్యోతి పేరు మీద కొంత ఆర్థిక సాయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తామని రాయపూడి సొసైటీ సభ్యులు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నేత కత్తెర సురేష్‌కుమార్, సీపీఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సీఐటీయూ రాజధాని ప్రాంత డివిజన్ కార్యదర్శి జొన్నకూటి నవీన్‌ప్రకాష్ డిమాండ్ చేశారు. రూ.11 లక్షల ఆర్థిక సహాయం విజయవాడ : కృష్ణా నదిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగి చనిపోయిన ఇబ్రహీంపట్నానికి చెందిన తళ్లీకూతుళ్లు మాధవి, కావ్యల కుటుంబానికి రూ.11 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి కారణమైన బోటు యాజమాన్యం రూ.6 లక్షలు అందజేస్తోందని, చంద్రన్న బీమా కింద రూ.5 లక్షలు మృతురాలు మాధవి భర్త సైదురాజుకు ఇస్తామని వెల్లడించారు. -
తప్పెవరిది..?
విజయనగరం ఫోర్ట్ : కవల పిల్లలు పుడతారని వైద్యులు చెప్పగానే రామలక్ష్మణులే పుడతారన్న సంతోష పడ్డారామె. వారిని పెంచి పెద్ద చేసేందుకు లెక్కకు మిక్కిలి కలలు కన్నారు. జీవితాంతం పిల్లలతో ఆనందంగా గడపాలనుకున్నారు. ఇంతలోనే విధి మృత్యువు రూపంలో కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కొమర అప్పయ్యమ్మ (23) అనే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆది వారం సాయంత్రం బంధువులు ఆమెను ఘోషాస్పత్రిలో చేర్పించారు. అంతకు ముందు నిర్వహించిన ఆల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఉదయం అప్పయ్యమ్మకు సాధారణ ప్రసవమైంది. మగ శిశువు జన్మించాడు. కానీ కవల పిల్లలు అని ముందే తెలిసిన వైద్యులు రెండో బిడ్డ కోసం ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితిలో ఆమె మృతి చెందారు. గర్భంలోని ఆడశిశువు కూడా మృతి చెందింది. పట్టించుకోలేదు.. మా చెల్లిని ఆదివారం ఘోషాస్పత్రిలో చేర్పించాం. ముందు సాధారణ ప్రసవమైంది. మగ బిడ్డ పుట్టాడని చెప్పారు. ఆ తర్వాత సుమారు గంట వరకు వైద్యులు ఆమెను పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలియలేదు. గంట తర్వాత ఆపరేషన్ చేయాలి, సీరియస్‌గా ఉందని చెప్పారు. అలా చెప్పిన కొద్ది సేపటికే మీ చెల్లి చనిపోయిందన్నారు. వారు సకాలంలో పట్టించుకుని ఉంటే మా చెల్లి బతికేది. – బర్రి అప్పన్న, మృతురాలి అన్నయ్య. వైద్యుల నిర్లక్ష్యం లేదు.. అప్పయ్యమ్మ మృతి విషయంలో వైద్యుల నిర్లక్ష్యం లేదు. తొలుత సాధారణ ప్రసవమైంది. మగబిడ్డ జన్మించాడు. రెండో బిడ్డను తీసేందుకు సిజేరియన్ చేసేందుకు వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ లోగా ఆమె ఊపిరితిత్తుల్లోకి ఉమ్మినీరు వెళ్లిపోవడంతో శ్వాస ఇబ్బందిగా మారి మరణించింది. ఆమెను బతికించడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. –జి.ఉషశ్రీ,జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి. ఇది బంధువుల వాదన.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి,బిడ్డ చనిపోయారని మృతిరాలి బంధువులు ఆరోపిస్తున్నారు. సాధారణ ప్రసవమైన తర్వాత అప్పయ్యమ్మను పట్టించుకోకుం డా వదిలేశారని వారు చెబుతున్నారు. సకా లంలో సిజేరియన్ చేసి ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరు బతికేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదిస్తే అలాంటిదేమి లేదని పేర్కొంటున్నారు. -
మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు
– చాపిరేవుల పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎం అండ్‌హెచ్‌ఓ – పీహెచ్సీ వైద్యుడు నటరాజ్‌పై ఆగ్రహం నంద్యాలరూరల్: జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఎం అండ్ హెచ్ఓ ఎం.స్వరాజ్యలక్ష్మి చెప్పారు. శుక్రవారం మండల పరిధిలోని చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలకు నిధుల కొరత, మందుల కొరత లేదని, కొందరు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పేద రోగులకు వైద్యం అందడం లేదన్నారు. చాపిరేవుల పీహెచ్సీ అపరిశుభంగా ఉండటంతో వైద్యుడు నటరాజ్‌పై డీఎంఅండ్ హెచ్ఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పేద రోగులకు ఎలా వైద్యం అందిస్తారని, పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు నెలలకు ఒకసారి పీహెచ్సీ సలహా కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించలేరా అంటూ వైద్యుడిని నిలదీశారు. ఓపీ లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంపీహెచ్ఈఓ జయశంక్‌రెడ్డి నాలుగు రోజులుగా విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేతనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి హాజరును రోజువారీగా బయోమెట్రిక్ ద్వారా జిల్లా కేంద్రానికి అందించాలని ఆదేశించారు. మళ్లీ రెండు వారాల్లో తనిఖీ వస్తానని ఆలోగా ఆసుపత్రిలో మార్పు కనిపించకపోతే ఇంటికి పంపుతానని డాక్టర్‌ను డీఎంహెచ్ఓ హెచ్చరించారు.