భలే వీడియో: ఇదే నా ఫ్యామిలీ.. పెళ్లైన 21 ఏళ్లలో 14 మంది పిల్లలతో.. | Mother Introduces Her 14 Children Born In Span Of 21 Years | Sakshi
Sakshi News home page

భలే వీడియో: ఇదే నా ఫ్యామిలీ.. పెళ్లైన 21 ఏళ్లలో 14 మంది పిల్లలతో..

Published Thu, Jan 19 2023 9:04 PM | Last Updated on Thu, Jan 19 2023 9:04 PM

Mother Introduces Her 14 Children Born In Span Of 21 Years - Sakshi

సోషల్‌ మీడియాలో అంటేనే ఓ​ స్పెషల్‌ వీడియోలు, ఫన్నీ వీడియోలు, ఫొటోలు ఉండే చోటు. ఇక, సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యేందుకు కొందరు వింత పనులు కూడా చేస్తుంటారు. తాజాగా ఓ తల్లి చేసిన ఫన్నీ వీడియో ఆమెను సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచేలా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

వివరాల ‍ప్రకారం.. సోషల్‌ మీడియాలో ఓ మహిళ తన ఫ్యామిలీని పరిచయం చేసింది. ఇందుకోసం కొత్తగా థింక్‌ చేసింది. తన సంతానమైన 14 మందిని డిఫరెంట్‌గా పరిచయం చేస్తూ వాళ్లు ఏయో సంవత్సరాల్లో జన్మించారో వీడియోలో చెప్పుకొచ్చారు. 21 ఏండ్ల వ్య‌వ‌ధిలో తాను జ‌న్మ‌నిచ్చిన 14 మంది  పిల్ల‌ల‌ను ప‌రిచ‌యం చేసిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

అ‍యితే, ఆమె.. 1996లో 20 ఏండ్ల వ‌య‌సులో తాను మొద‌టిగా కూతురుకు జ‌న్మ‌నిచ్చాన‌ని ప్ర‌స్తావించారు. ఆపై వ‌రుస‌గా త‌న పిల్ల‌ల‌ను చూపుతూ వారు ఏ ఏడాదిలో జ‌న్మించారనే వివ‌రాలు పొందుప‌రిచారు. చివ‌రిగా తాను 42 ఏండ్ల వ‌య‌సులో 2017లో చిన్న కూతురుకి జ‌న్మ‌నిచ్చాన‌ని నవ్వుతూ తెలిపారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో పాటుగా సీరియస్‌ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అంత మంది పిల్లల్ని కనడమేంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement