యశవంతపుర: కరోనా నియంత్రణ కోసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్యా మంత్రి సుధాకర్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడుతూ కేరళ నుంచి కర్ణాటకకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా వారంపాటు క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు కూడా క్వారంటైన్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. జనం గుంపులుగా చేరటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, కాబట్టి సభలు, సమావేశాలను నిర్వహించవద్దని సూచించారు. దక్షిణకన్నడ, ఉడుపి, చామరాజనగర జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్నారు.
చదవండి: US Study: ఆయుః ప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా పడిపోతోంది!
కరోనా డిశ్చార్జిల్లో క్షయ వ్యాధి
కరోనా నుంచి కోలుకున్న 104 మందిలో క్షయ (టీబీ) జబ్బు బయట పడింది. ఆరోగ్యశాఖ ఆగస్ట్ 16 నుంచి 29 వరకు, డిశ్చార్జి అయిన 5.37 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈ విషయం వెల్లడైంది. కరోనా వల్ల మొత్తంగా 24,598 మంది క్షయకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు.
చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్‌లో రచ్చ రచ్చ
Comments
Please login to add a commentAdd a comment