![Karnataka Tourism Minister Ravi Tests Positive For Corona Positive - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/13/rvai.jpg.webp?itok=Nw7bv6kM)
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక పర్యటక శాఖ మంత్రి సీటీ రవి తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా వైరస్ సోకిన మొదటి మంత్రి రవి కావటం గమనార్హం. ‘ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. అదృష్టవశాత్తు నా భార్య పల్లవి, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా నెగటివ్ వచ్చింది’ అని మంత్రి రవి ట్విటర్‌లో పేర్కొన్నారు. (‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా)
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కరోనాకు చికిత్స తీసుకొని తిరిగి ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. అప్పటికి వరకు తాను ఇంటికే పరిమితమై పనులను కొనసాగిస్తాని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో ముగ్గురు ఎమ్మెల్యేకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందికి కరోనా సోకటంతో సీఎం బీఎస్ యడియూరప్ప కూడా హోం క్వారంటైన్‌ని పరిమితమయ్యారు.
Yesterday, I along with my wife Pallavi & my staff members underwent COVID19 test. Fortunately, my wife Pallavi and all my staff members are tested Negative.
— C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) July 13, 2020
Third umpire's result for me has confirmed that I'm Covid Positive. However, I'm feeling absolutely fine.
Comments
Please login to add a commentAdd a comment