సాక్షి, హైదరాబాద్ : ప్రాణంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ఏ మూల నుంచి వస్తోందోనని ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. మరోవైపు కరోనా బాధితులకు వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వైరస్ బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. పలు చోట్ల వారికి పూలు, హారతితో స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. (వైరల్ వీడియా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ)
గత రెండు వారాలుగా నగరంలోని ఇందిరా గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం అదిస్తున్న డాక్టర్ విజయశ్రీకి ఆమె నివాసం ఉంటున్న వీధి ప్రజలు అపార్టమెంట్‌లో నిలబడి ఘన స్వాగతం పలికారు. రెండు వారాల తరువాత ఆమె ఇంటికి చేరుకోగా.. హర్షధ్వానాలతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. దీంతో డాక్టర్ విజయశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వైద్యురాలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఇలాంటి వీడియోని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సమాజం అండగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. (వలస కూలీల్లో కరోనా కలకలం)
Comments
Please login to add a commentAdd a comment