IPL 2024: సన్‌రైజర్స్‌ విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ | Sunrisers Hyderabad breaks their own record of highest total in IPL | Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌ విధ్వంసం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌! 20 రోజుల్లోనే

Published Mon, Apr 15 2024 9:52 PM | Last Updated on Tue, Apr 16 2024 10:03 AM

Sunrisers Hyderabad breaks own record of highest total in IPL - Sakshi

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలనం సృష్టించింది. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్‌ఆర్‌హెచ్ నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో బాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు.

ఆర్సీబీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(67), మార్‌క్రమ్‌(35), సమద్‌(37) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఐపీఎల్‍లో తాను సృష్టించిన అత్యధిక పరుగుల రికార్డును.. 20 రోజుల్లో తానే తిరగరాసింది. ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 277 పరుగులు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement