ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సమర్పించుకుంది.
ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్‌క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు.
కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు.
"ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్‌లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్‌కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం.
ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్‌లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు.
తొలుత బౌలింగ్‌లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment