RCB Vs PBKS: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. వీడియో వైర‌ల్‌ | IPL 2024 RCB Vs PBKS: Fan Invades Pitch To Touch Virat Kohlis Feet And Hug Him, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs PBKS: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. వీడియో వైర‌ల్‌

Published Mon, Mar 25 2024 10:59 PM | Last Updated on Tue, Mar 26 2024 12:33 PM

Fan Invades Pitch To Touch Virat Kohlis Feet And Hug Him - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్ సంద‌ర్భంగా  ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు.

అత‌డు నేరుగా బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి వ‌ద్ద‌కు వెళ్లి  కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ స‌మ‌యంలో కోహ్లి త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. సద‌రు అభిమానిని పైకి లేపి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించాడు.ఆ త‌ర్వాత కోహ్లిని హగ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు ఆ అభిమాని

అంత‌లోనే సెక్యూరిటి సిబ్బంది కూడా అక్క‌డికి వ‌చ్చి అత‌డిని బ‌య‌ట‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా మైదానంలోకి వచ్చిన అభిమాని పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును అభిమానులు కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 77 ప‌రుగులు చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement