Hardik Pandya Breaks Rohit Sharma Record as Captain after 5 Consecutive Wins - Sakshi
Sakshi News home page

అపజయమెరుగని హార్ధిక్‌.. హిట్‌మ్యాన్‌ రికార్డు బద్దలు

Published Thu, Jan 5 2023 10:23 AM | Last Updated on Thu, Jan 5 2023 11:01 AM

Hardik Pandya Breaks Rohit Sharma Record For Consecutive 5 Victories As Team India Captain - Sakshi

IND VS SL 2nd T20: భారత టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత క్రికెట్‌ చరిత్రలో మరే ఇతర కెప్టెన్‌కు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత కెప్టెన్‌గా తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ టై గా ముగిసింది) సాధించి, అపజయమెరుగని కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

ఈ క్రమంలో హార్ధిక్‌.. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్‌ కూడా కెప్టెన్‌గా తన తొలి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. అతని సారధ్యంలో టీమిండియా మధ్యలో ఓ మ్యాచ్‌లో (5వ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమి) ఓడింది. 

అయితే రోహిత్‌ టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ అయ్యాక వెనుదిరిగి చూడలేదు. శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత హిట్‌మ్యాన్‌ టీమిండియాను వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు.

ఆ తర్వాత 4 మ్యాచ్‌ల్లో 3 ఓటముల తర్వాత రోహిత్‌ మళ్లీ పుంజుకన్నాడు. ఈసారి వరుసగా 14 మ్యాచ్‌ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. టీ20ల్లో వరుస అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఈ రికార్డు ఇప్పటికీ హిట్‌మ్యాన్‌ పేరిటే ఉంది.

పూణే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 5) జరుగనున్న రెండో టీ20, కెప్టెన్‌గా హార్ధిక్‌కు 7వ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లోనూ హార్ధిక్‌ టీమిండియాను విజయపధంలో నడిపిస్తే.. హిట్‌మ్యాన్‌ వరుస విజయాల రికార్డుకు మరింత చేరువవుతాడు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ కాకుండానే హార్ధిక్‌ ఈ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కొసమెరుపు. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో ఇవాళ జరుగనున్న రెండో టీ20లో గెలిచి, మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఎలాగైనా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు లంక సైన్యం సైతం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని భావిస్తుంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను సంజూ శాంసన్‌ దెబ్బేశాడు. గాయం కారణంగా అతను ఈ సిరీస్‌ మొత్తానికే దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో కొత్త కుర్రాడు జితేశ్‌ శర్మ జట్టులో చేరాడు. భారత్‌-శ్రీలంక మధ్య రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement