భారత టీ20 జట్టులో కీలక మార్పులు చేపట్టేందుకు బీసీసీఐ సిద్దమైంది. ఇందులో భాగంగానే టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించాలి అని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత టీ20 కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దృవీకరించారు. "భారత టీ20 కెప్టెన్సీలో మార్పు చేసే సమయం అన్నమైంది. రోహిత్ కొన్నాళ్ల పాటు భారత కెప్టెన్‌గా కొనసాగాలని కొంత మంది భావిస్తున్నారు. కానీ అతడి వయస్సు దృష్ట్యా అతడి పని భారాన్ని తగ్గించాలి అనుకుంటున్నాము. అతడు మిగితా రెండు ఫార్మాట్‌ల్లో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
టీ20 ప్రపంచకప్- 2024 కోసం ఇప్పటి నుంచే మేము సన్నద్దం కావాలి. ఇందుకోసం భారత జట్టు కీలక మార్పులు చేపట్టేందుకు సిద్దమయ్యాము. ఇక టీ20ల్లో కెప్టెన్సీ రోల్‌కు హార్దిక్ పాండ్యా సరైనోడు అని భావిస్తున్నాము. మా తదుపరి టీ20 సిరీస్‌కు ముందు సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో పేర్కొన్నారు.
కాగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ అనంతరం వచ్చే ఏదాది జనవరిలో శ్రీలంకతో టీ20లు ఆడనుంది. ఈ మధ్య కాలంలో భారత జట్టు కేవలం వన్డేలు, టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడనుంది. అంటే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోనుంది. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: India-A vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. భారత-"ఏ" జట్టు కెప్టెన్‌గా పుజారా
Comments
Please login to add a commentAdd a comment