ఇషాన్ కిషన్... రూ. 15 కోట్ల 25 లక్షలు(ముంబై ఇండియన్స్)... శ్రేయస్ అయ్యర్ రూ. 12.25 కోట్లు... ఐపీఎల్ మెగా వేలం-2022లో రికార్డు ధరకు అమ్ముడుపోయారు. వీరితో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం కోట్లు కొల్లగొట్టారు. మరికొందరికి ఆశించినంత దక్కలేదు. అయితే, ఈ భావోద్వేగాల ప్రభావం జాతీయ జట్టు ప్రయోజనాలపై పడకూడదని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లను హెచ్చరించాడు.
అదే విధంగా ఐపీఎల్‌లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఎన్నో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నారు? అన్న అంశాలతో తమకు సంబంధం లేదన్న హిట్‌మ్యాన్.. భారత్ తరఫున ఆడేటపుడు జట్టు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ... ‘‘వేలం ముగిసింది. భావోద్వేగాలకు గురికావడం సహజం.
అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు దృష్టి మొత్తం విండీస్‌తో సిరీస్‌పైనే ఉండాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నిన్న మాట్లాడాము. రానున్న రెండు వారాలు ఎంతో ముఖ్యం. బ్లూ జెర్సీలో ఆడుతున్నపుడు ఎలా ఉండాలో మరోసారి గుర్తు చేశాం. నిజానికి వాళ్లంతా ప్రొఫెషనల్స్. అయితే, మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయా ఫ్రాంఛైజీలకు ఆడుతున్నపుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. టీమిండియాకు ఆడేటపుడు అలా ఉండదు.
ప్రస్తుతం జాతీయ జట్టు కూర్పుపైనే మా దృష్టి’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్ గురించి తాను ప్రస్తుతం మాట్లాడదలచుకోలేదన్న రోహిత్ శర్మ... ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నాడు. కాగా ఇప్పటికే స్వదేశంలో విండీస్‌తో వన్డే సిరీస్ 3-0తో వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్: భారత జట్టు ఇదే!
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వైస్ కెప్టెన్- వికెట్ కీపర్), యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్.
చదవండి: IPL 2022 Auction: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్‌రౌండర్ భార్య
A sneak peek into #TeamIndia's fielding drill at the Eden Gardens. 👀 👌#INDvWI | @Paytm pic.twitter.com/wSFH4keVTx
— BCCI (@BCCI) February 15, 2022
Comments
Please login to add a commentAdd a comment