స్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. బార్బోడస్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విండీస్ తమ పేలవ ఆటతీరును కొనసాగించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, జడేజా మూడు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు.
విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాయ్ హోప్(43) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 15 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తమ బ్యాటింగ్ లైనప్‌లో ప్రయోగాలు చేసింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ బ్యాటింగ్ రాలేదు. అతడి స్ధానంలో కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అదే విధంగా విరాట్ కోహ్లి కూడా ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్ రాలేదు. టీమిండియా బ్యాటర్లలో కిషన్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యాన్ 12 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని రోహిత్ కొనియాడాడు. " బార్బోడస్ పిచ్ అలా ప్రవర్తిస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 250 పరుగులు చేస్తే చాలు డిఫెండ్ చేసుకోవచ్చు. ఈ పిచ్ పేసర్లు,స్పిన్నర్‌లకు అనుకూలంగా ఉంది.
మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేవలం 114 పరుగులకే ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశారు. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడితో పాటు ముఖేష్ కుమార్ కూడా మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. మా ముందు తక్కువ లక్ష్యం ఉంది కాబట్టి బ్యాటింగ్ లైనప్‌లో ప్రయోగాలు చేశాం. వైట్‌బాల్ స్పెషలిస్టులకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం.
అందుకే కిషన్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశాం. అదే విధంగా సూర్యను కూడా ఫస్ట్‌డౌన్‌లో పంపాం. ఇక నేను నా డెబ్యూ మ్యాచ్‌లో ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చాను. అప్పటి రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయి. ఇషాన్ కూడా అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు నుంచి మేము అదే ఆశిస్తున్నామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. తొలి భారత ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment