
లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ముగిసిన ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఆట చివరి రోజు జస్‌ప్రీత్ బుమ్రాపై బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు సంధించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. మాటలతోనూ అతనిపై దాడికి దిగారు. అయినా బుమ్రా- షమీ జోడీ పట్టుదలతో బ్యాటింగ్ చేసి 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
చదవండి:Suryakumar Yadav: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే?
అనంతరం 272 పరుగుల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్‌ని విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌తో ఆడుకున్నాడు. మరీ ముఖ్యంగా.. బుమ్రాపై మాటల యుద్ధానికి దిగిన ఆటగాళ్లని టార్గెట్‌గా చేసుకున్న కోహ్లీ.. మైదానంలో కవ్వింపులతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోరు 120 పరుగుల వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చివరి వికెట్‌గా జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చిన సమయంలో కూడా విరాట్ కోహ్లీ, హెల్మెన్‌ను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయాలని సూచించడం... దానికి సిరాజ్ కూడా తలకు వేస్తానంటూ సైగలు చేయడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియో లో వైరల్ అవుతోంది.
Siraj and Kohli 🤪 pic.twitter.com/BmRUcw95aV
— Simran (@CowCorner9) August 20, 2021