టీ20 ప్రపంచకప్-2022 మెగా సమరానికి మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జిలాంగ్ వేదికగా ఆక్టోబర్ 16న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే.. రోహిత్ సేన తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఈ మెగా ఈవెంట్‌కు రెండు వారాల ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో పరజాయం పాలైంది.
అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు రాహల్ 74 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు.
చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తరపున టాప్ రన్ స్కోరర్ కేఎల్ రాహుల్ కావచ్చు. అతడు ఓపెనర్‌గా వస్తాడు కాబట్టి మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియాలో పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తాయి. అక్కడ బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. అక్కడి పిచ్‌లు కేఎల్ రాహుల్‌కు సరిగ్గా సరిపోతాయి" అని పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి
Comments
Please login to add a commentAdd a comment