సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయ్యి అభిమానులను నిరాశ పరిచింది. కానీ ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా మ్యాచ్ మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లి భాంగ్రా డ్యాన్స్ చేస్తూ ఆభిమానులను కాసేపు అలరించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సౌథాంప్టన్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతించింది.
ఈ క్రమంలో స్టేడియానికి వచ్చిన 'భారత అభిమానులు.. డ్రమ్స్ వాయిస్తూ టీమిండియాని ఉత్సాహపరిచారు. మూడో రోజు రెండో సెషన్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా, 9వ ఓవర్‌లో భారత అభిమానులు భాంగ్రా మ్యూజిక్ వాయించగానే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తదనుగుణంగా స్టెప్‌లు వేస్తూ కనిపించాడు. అతని పక్కనే రిషబ్ పంత్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా ఉన్నారు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్లకు 102 పరుగులు చేసింది.ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగో రోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది.
Kohli can't dance saala pic.twitter.com/HLQ1Vy6CmV
— bhargavprdip (@bhargavprdip) June 20, 2021
Comments
Please login to add a commentAdd a comment