సౌతాంప్టన్: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఆరంభమైన దగ్గర్నుంచీ ఏదొక సమయంలో వర్షం పలకరిస్తూనే ఉండటంతో అసలు ఫలితం వస్తుందా అనే సందిగ్థతను అధిగమించి మరీ కివీస్ విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా 139 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే కివీస్ ముందుంచగా, దానిని కివీస్ 45.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ‘కేన్ బృందానికి నా అభినందనలు. ఆటలో నిలకడ, పట్టుదల చూపించిన కివీస్ విజయాన్నందుకుంది. మాపై మొదటి నుంచి ఒత్తిడి పెంచిన ప్రత్యర్థికే గెలిచే అర్హత ఉంది. చివరి రోజు వారి బౌలర్లు తమ ప్రణాళికలు పక్కాగా అమలు చేశారు. మేం మరో 30–40 పరుగులు చేయాల్సింది. నలుగురు పేసర్లను తీసుకోవాలంటే అందులో ఒకరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయి ఉండాలి. అయినా ఇదే జట్టు ఇప్పటి వరకు భిన్న పరిస్థితుల్లో బాగా ఆడింది. ఆట ఇంకొంచెం ఎక్కువ సేపు సాగి ఉంటే స్పిన్నర్లు ఇంకా ప్రభావం చూపించేవారు. ఈ ఫలితం టెస్టు క్రికెట్‌కు మేలు చేస్తుంది. క్రికెట్‌కు గుండెచప్పుడులాంటి టెస్టులకు మరింత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది’ అని తెలిపాడు.
ఇక్కడ చదవండి: ‘కివీ’ రివ్వున ఎగిరి...
Comments
Please login to add a commentAdd a comment