దుబాయ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ డ్రా అయినా లేదంటే టై అయిన పక్షంలో న్యూజిలాండ్, టీమిండియాలను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ వెబ్సైట్లో ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
ఆట పరిస్థితుల ఆధారంగా మ్యాచ్ డ్రాగా ముగిసినా, లేదంటే టై అయినా కూడా రెండు టీమ్‌లను జాయింట్ విన్నర్స్‌గా ప్రకటిస్తామని ఐసీసీ గ్లోబల్ బాడీ తెలిపింది. అంతేకాదు రిజర్వ్‌డే నిబంధనను పక్కనపెట్టేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు నిర్ణయాలు ఇప్పటికిప్పుడు తీసుకున్నవి కాదని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రకటన కంటే ముందు జూన్ 2018లోనే తీసుకున్న నిర్ణయాలేనని ఐసీసీ తెలిపింది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదను తొలుత ఐసీసీ పరిశీలించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచన.
చదండి: మీ గొప్ప నాకు కోపం తెప్పించింది
టఫ్ ఫైట్
టెస్ట్ క్రికెట్ చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఎదురు చూస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లండ్ సౌథాంప్టన్‌లోని హ్యాంప్‌షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్న టీమిండియా ప్లేయర్లు.. జూన్ 2న విమానం ఎక్కబోతోన్నారు. మూడురోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. అటు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం కసరత్తు పూర్తి చేసింది. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్ల నుంచి అత్యధిక పాయింట్లను టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్‌కు చేరాయి. తొలిసారిగా ఛాంపియన్‌షిప్‌ను జరుపుతుండడంతో ఈ టోర్నీపై క్రికెట్ అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. బీసీసీఐ అఫీషియల్ బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నర్ స్టార్ స్పోర్ట్స్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment