
దుబాయ్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ నెలలో జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను కచ్చితంగా జరిపి తీరుతామని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పష్టం చేసింది. భారత్‌లో ప్రస్తుతం రెండో దశ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడకు రాకపోకలపై యూకే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. భారత్‌ను రెడ్‌లిస్ట్ జాబితాలో పెట్టారు.
భారత్ నుంచి తమ దేశానికి తిరిగి వచ్చే బ్రిటన్ వాసులు పది రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలను పెట్టింది. ఈ నేపథ్యంలో డబ్యూటీసీ ఫైనల్‌పై అనుమానాలు ఏర‍్పడ్డాయి. దానికి సమాధానంగా మంగళవారం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమే చాంపియన్‌షిప్ పైనల్ జరుగుతుందని తెలిపింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో ఫైనల్ జరుగుతుందని పేర్కొంది.
ఇక్కడ చదవండి: ధోని.. 21 నెలలు ఆలస్యమైంది!
90 నిమిషాల్లో వెళ్లాలి.. లేకపోతే కోహ్లికి ఫైన్..!
Comments
Please login to add a commentAdd a comment