T20 World Cup 2021: Pakistan Are Favourites Now After Emphatic Win Over India - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: భారత్‌పై విజయం.. ఇప్పుడు పాకిస్తానే టైటిల్‌ ఫేవరెట్

Published Mon, Oct 25 2021 7:35 PM | Last Updated on Tue, Oct 26 2021 2:12 PM

T20 World Cup 2021: Pakistan are favourites now after emphatic win over India - Sakshi

Shane warne comments Pakistan: టీ20 ప్రపంచకప్‌-2021లో భారత్‌పై సంచలన విజయం నమోదు చేసిన పాకిస్తాన్‌పై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌పై విజయం సాధించడంతో పాకిస్తానే టైటిల్‌ ఫేవరెట్ అని అతడు అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ రిజ్వాన్‌, బాబర్‌ అద్బుతంగా ఆడారాని వార్న్ కొనియాడాడు. "టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించి పాక్‌ సత్తా చాటింది. నా అభిప్రాయం ప్రకారం ఈసారి పాకిస్తాన్‌ ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో పాక్‌ ఆదరగొట్టింది. బాబర్ ఆజం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకరిగా తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నాడు" అని వార్న్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా మ్యాచ్‌లో తొలుత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి చేసింది. ఛేదనలో దూకుడుగా ఆడేసిన పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్‌  అలవోకగా ఆ జట్టుని గెలిపించారు. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో  పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 

చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్‌ ఏంటి?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement