లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు ఘోర వైఫల్యం పై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో షమీ మాట్లాడూతూ.. తమ జట్టు పేలవ ప్రదర్శన పై మాకు ఎలాంటి దిగులు లేదని అన్నాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఈ ఒక్క మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శన ఆటగాళ్ల మనోబలాన్ని దెబ్బ తీయదని స్పష్టం చేశాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లును మేము రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసామాని షమీ తెలిపాడు.
కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని మహమ్మద్ షమీ చెప్పాడు. మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే మేము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి. ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుంది. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగా ఔట్ చేయాలో మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుందని షమీ చెప్పుకొచ్చాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా, ఆతిధ్య ఇంగ్లండ్ 354 పరుగుల ఆధిక్యత సాధించింది.
చదవండి: IND Vs ENG 3rd Test Day 3: ఇంగ్లండ్ 432 ఆలౌట్.. 354 పరుగుల ఆధిక్యంలో ఆతిధ్య జట్టు
Comments
Please login to add a commentAdd a comment