india-england
-
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
IND Vs ENG: భారత్‌ను ముంచిన బ్యాటర్లు
ఇంగ్లండ్ స్కోరు 7 వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. కానీ రెండో వికెట్ 83 పరుగుల వద్ద పడింది. అప్పటికి 9 ఓవర్లే ముగిశాయి. ఇలా పుంజుకున్న ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేయడంతో అనూహ్యంగా 127 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. హమ్మయ్య పట్టు సాధించామనుకుంటే... డెత్ ఓవర్లు, మిగతా బౌలర్ల వైఫల్యంతో ఇంగ్లండ్ 170 పైచిలుకు పరుగులు చేసింది. కానీ భారత్ మొదటి వికెట్ 16 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాతా పడిపోతూనే 85/5 స్కోరు వద్ద సగం వికెట్లను సమరి్పంచుకొని ఓటమికి స్వాగతం పలికింది. దీంతో తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తా చాటితే... ఈ ఒక్కటి గెలిస్తే సిరీస్ వశమయ్యే మ్యాచ్‌లో నిలువెత్తు నిర్లక్ష్యం భారత్‌ను ముంచింది. రాజ్‌కోట్: సిరీస్‌ను గెలిపించే మ్యాచ్‌ను భారత్ సిరీయస్‌గా తీసుకున్నట్లు లేదు. అందుకే తగిన మూల్యం ఓటమిగా చెల్లించుకుంది. రేసులో నిలవాలనుకున్న ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్... వరుణ్ బిగించిన స్పిన్ ఉచ్చు నుంచి బయటపడి... అనంతరం ఆతిథ్య జట్టును బంతితో ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఫలితంగా సిరీస్ రేసులో నిలిచేందుకు ఇంగ్లండ్ 26 పరుగులతో భారత్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టేసింది. ముందుగా ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.బెన్ డకెట్ (28 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్ (24 బంతుల్లో 43; 1 ఫోర్, 5 సిక్స్‌లు) మెరిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (5/24) తిప్పేశాడు. హార్దిక్ పాండ్యాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లు సాల్ట్ (5)ను పాండ్యా త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ డకెట్, బట్లర్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గాడిన పెడితే వరుణ్ ఉచ్చులో ఇంగ్లండ్ చిక్కుకుంది. బట్లర్ సహా, స్మిత్ (6), ఓవర్టన్ (0), కార్స్ (3), ఆర్చర్ (0)లు వికెట్లు పారేసుకున్నారు. కానీ లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో కూలుతున్న పర్యాటక జట్టు కోలుకుంది. 127/8 నుంచి 171/9 స్కోరుకు చేరుకుంది. లక్ష్యంపై నిర్లక్ష్యం! భారత్ ముందున్నది సాధారణ లక్ష్యం కానేకాదు. ఇలాంటి ఛేదనకు చక్కని శుభారంభం, తదనంతరం మిడిలార్డర్ బాధ్యత ఎంతో ముఖ్యం... కానీ ఈ ఒక్కటీ ఓడితే పోయేదేముంది అన్నట్లు భారత బ్యాటర్ల ఆటతీరు సాగింది. సంజూ సామ్సన్ (3), అభిషేక్ (14 బంతుల్లో 24; 5 ఫోర్లు), కెప్టెన్ సూర్యకుమార్ (14), తిలక్ వర్మ (18), సుందర్ (6), అక్షర్ (15), జురేల్ (2) ఇలా అంతా... మా వల్లకాదంటూ ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. హార్దిక్ చేసిన ఆ మాత్రం స్కోరు భారత్ పరువు నిలిపింది... కానీ ఒడ్డున పడేయలేకపోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 5; డకెట్ (సి) అభిషేక్ (బి) అక్షర్ 51; బట్లర్ (సి) సామ్సన్ (బి) వరుణ్ 24; హ్యారీ బ్రూక్ (బి) బిష్ణోయ్ 8; లివింగ్‌స్టోన్ (సి) జురేల్ (బి) పాండ్యా 43; స్మిత్ (సి) జురేల్ (బి) వరుణ్ 6; ఓవర్టన్ (బి) వరుణ్ 0; కార్స్ (సి) తిలక్‌వర్మ (బి) వరుణ్ 3; ఆర్చర్ (బి) వరుణ్ 0; రషీద్ నాటౌట్ 10; మార్క్‌వుడ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.వికెట్ల పతనం: 1–7, 2–83, 3–87, 4–108, 5–115, 6–115, 7–127, 8–127, 9–147. బౌలింగ్: షమీ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 4–0–33–2, సుందర్ 1–0–15–0, వరుణ్ 4–0– 24–5, రవి బిష్ణోయ్ 4–0–46–1, అక్షర్ పటేల్ 3–0–19–1, అభిషేక్ 1–0–4–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 3; అభిషేక్ (సి) ఆర్చర్ (బి) కార్స్ 24; సూర్య (సి) సాల్ట్ (బి) వుడ్ 14; తిలక్ వర్మ (బి) రషీద్ 18; హార్దిక్ పాండ్యా (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 40; సుందర్ (సి) బట్లర్ (బి) ఓవర్టన్ 6; అక్షర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 15; జురేల్ (సి) సాల్ట్ (బి) కార్స్ 2; షమీ (సి) బ్రూక్ (బి) ఓవర్టన్ 7; రవి బిష్ణోయ్ నాటౌట్ 4; వరుణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.వికెట్ల పతనం: 1–16, 2–31, 3–48, 4–68, 5–85, 6–123, 7–131, 8–140, 9–140. బౌలింగ్: ఆర్చర్ 4–0–33–2, వుడ్ 3–0–29–1, బ్రైడన్ కార్స్ 4–0–28–2, లివింగ్‌స్టోన్ 1–0–11–0, రషీద్ 4–0–15–1, జేమీ ఓవర్టన్ 4–0–24–3. -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
భారత్‌తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌టీఏ: రిషి సునాక్
లండన్: భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు. -
ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయ్! దిగులెందుకు..
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు ఘోర వైఫల్యం పై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో షమీ మాట్లాడూతూ.. తమ జట్టు పేలవ ప్రదర్శన పై మాకు ఎలాంటి దిగులు లేదని అన్నాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఈ ఒక్క మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శన ఆటగాళ్ల మనోబలాన్ని దెబ్బ తీయదని స్పష్టం చేశాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లును మేము రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసామాని షమీ తెలిపాడు. కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని మహమ్మద్ షమీ చెప్పాడు. మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే మేము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి. ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుంది. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగా ఔట్ చేయాలో మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుందని షమీ చెప్పుకొచ్చాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా, ఆతిధ్య ఇంగ్లండ్ 354 పరుగుల ఆధిక్యత సాధించింది. చదవండి: IND Vs ENG 3rd Test Day 3: ఇంగ్లండ్ 432 ఆలౌట్.. 354 పరుగుల ఆధిక్యంలో ఆతిధ్య జట్టు -
టెస్టు సిరీస్ షెడ్యూల్లో మార్పులేదు: ఈసీబీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకుగాను... ఇంగ్లండ్–భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ‘బీసీసీఐతో పలు అంశాలపై మేము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లను సర్దుబాటు చేసేందుకు ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని వారు మమ్మల్ని కోరలేదు. ఇప్పటికైతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే టెస్టు సిరీస్ జరుగుతుంది’ అని ఈసీబీ వర్గాలు తెలిపాయి. భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఆగస్టు 4న మొదలవుతుంది. -
రోహిత్ శర్మకు షాక్..
ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. తొలి మూడు టెస్ట్‌లకు సెలక్షన్ కమిటీ రోహిత్‌ను ఎంపిక చేయలేదు. గాయంతో దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకున్నారు. యోయో టెస్టు విఫలమవడంతో వన్టే, టీ20 సిరీస్‌లకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేశాడు. బుమ్రా జట్టులోకి రావడంతో టీమిండియాకు బౌలింగ్ విభాగంలో మరింతగా బలపడనుంది. యువ ఆటగాళ్లైన రిషబ్ పంత్, కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్‌లకు జట్టులో స్థానం లభించింది. యువ వికెట్ కీపర్ రిషబ్‌పంత్, పేసర్ శార్దుల్ ఠాకూర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దీంతో ఈ సిరీస్ ద్వారా యువ ఆటగాళ్లు టెస్టులో అరంగ్రేటం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీన ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన సిరీస్ కావడంతో 18 మందితో భారత జట్టును ప్రకటించినట్లు తెలుస్తోంది. కోహ్లి సేన మంగళవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లతో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన విషయం విదితమే. మొదటి మూడు టెస్టుల జట్టు : విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్, పుజారా, రహానే(వైఎస్- కెప్టెన్), కరుణ్ నాయర్, కార్తీక్(వికెట్ కీపర్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, హర్దిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, బుమ్రా, శార్దుల్ ఠాకూర్. -
‘డ్రా’తో సరిపెట్టుకున్నారు
ఇఫో (మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో తుదికంటా ఆధిపత్యం చలాయించిన భారత్ చివరకు 1–1తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి పాలైన సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శైలానంద్ లక్రా (14వ ని.) తొలి అంతర్జాతీయ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా... డిఫెండర్లు ప్రత్యర్థిని నిలువరించడంతో ఆట 53వ నిమిషం వరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మార్క్ గ్లెగోర్న్ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్లు లభించినా వరుణ్ కుమార్, అమిత్ రొహిదాస్ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. -
తొలి టెస్టు డ్రానా... డ్రామానా!
-
ఇక డ్రానే!
భారత్-ఇంగ్లాండ్ ల మధ్య రాజ్ కోట్ లో మొదలైన తొలి టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 114 పరుగుల చేసిన ఇంగ్లాండ్ 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్లు కుక్(46), హసీబ్ హమీద్(62) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఉత్తమ ఆటతీరును కనబరిచిన ఇంగ్లాండ్ 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 488 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేవలం ఒకే రోజు ఆట మిగిలివుండటంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా తొలిటెస్టులో ఇప్పటికే ఇంగ్లాండు తరఫు నుంచి మూడు సెంచరీలు, భారత్ తరఫు నుంచి రెండు సెంచరీలు నమోదయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ల దూకుడు చూస్తుంటే మరో రెండు సెంచరీలు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అంతకుముందు 319-4 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత బ్యాట్స్ మన్లలో రవిచంద్రన్ అశ్విన్(70) మినహా మిగతా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. నాలుగో రోజు ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ కు మూడు వికెట్లు దక్కగా, మొయిన్ అలీకి రెండు, జాఫర్ అన్సారీకి ఒక వికెట్ దక్కింది. -
ఇంగ్లండ్‌కు భారత్ ధీటైన జవాబు
-
భారత్ ధీటైన జవాబు
-
భారత్ ధీటైన జవాబు
రాజ్‌కోట్: ఇంగ్లాడుతో తొలి టెస్టులో మూడు రోజు భారత జట్టు సత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 218 పరుగులు చేధించాల్సివుంది. భారత బ్యాట్స్‌మన్స్ లో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు మూడో రోజు శతకాలతో అదరగొట్టారు. పుజారా 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగగా మరికొద్దిసేపు క్రీజులో నిలిచిన విజయ్(126) పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగుస్తుందనగా విజయ్ వెనుదిరగడం భారత్ కు గట్టి దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అమిత్ మిశ్రా కేవలం రెండు బంతులే ఎదుర్కొని వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23) పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్, సువర్ట్ బ్రాడ్, అదిల్ రషీద్, జాఫర్ అన్సారీలు తలో వికెట్ పడగొట్టారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గౌతమ్ గంభీర్ ఎల్ బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.