ఇంగ్లాడుతో తొలి టెస్టులో మూడు రోజు భారత జట్టు సత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 218 పరుగులు చేధించాల్సివుంది. భారత బ్యాట్స్‌మన్స్ లో ఛటేశ్వర పుజారా, మురళీ విజయ్ లు మూడో రోజు శతకాలతో అదరగొట్టారు.