ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు.
ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్‌లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment