టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలిగించి రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. అయితే అనూహ్యంగా కోహ్లిని తప్పించి రోహిత్‌కు సారథ్య బాధ్యతలు బీసీసీఐ అప్పజెప్పింది. దీంతో కోహ్లి అసహానానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. ది టెలిగ్రాఫ్‌లో ప్రచురించిన కథనాలు ప్రకారం కోహ్లి తన పేరును ఉపసంహరించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లి ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇంకా వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించలేదు. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!
Comments
Please login to add a commentAdd a comment