ODI Captain
-
Official: షాహిన్‌పై వేటు.. పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది. సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు. అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్లను సారథులుగా ఎంపిక చేశారు. ఘోర పరాజయాలు ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు! ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. చదవండి: #Mayank Yadav: ఐపీఎల్లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్? Babar Azam appointed as white-ball captain Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK — Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024 -
వెస్టిండీస్ సంచలన విజయం
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45), స్యామ్ కరన్ (38) రాణించారు. మోతీ, ఒషాన్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వన్డేల్లో విండీస్‌కు ఇది రెండో అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. 39 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 214/5 వద్ద విండీస్‌కు విజయావకాశాలు తక్కువగా కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ పరిస్థితి మార్చింది. హోప్, షెఫర్డ్ ఆరో వికెట్‌కు 51 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సిన దశలో స్యామ్ కరన్ వేసిన ఓవర్లో హోప్ 3 సిక్సర్లు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో హోప్ 16వ సెంచరీ పూర్తయింది. చివరి 9.5 ఓవర్లలో విండీస్ 112 పరుగులు సాధించింది. మరోవైపు స్యామ్ కరన్ వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు (98) ఇచి్చన బౌలర్‌గా నిలిచాడు. -
ధవన్ లాగే రోహిత్‌నూ వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తారా..?
గడిచిన 9 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోడం అభిమానులు, ఆటగాళ్లను ఎంత బాధిస్తుందో బీసీసీఐని కూడా అంతే ఆవేదనకు గురి చేస్తుంది. ఈ విషయంలో భారత్ ఓ మోస్తరు జట్ల కంటే హీనంగా ఉండటాన్ని టీమిండియా ఫ్యాన్స్, బీసీసీఐ చిన్నతనంగా భావిస్తుంది. వెస్టిండీస్, శ్రీలంక లాంటి జట్లు సైతం ఐసీసీ ట్రోఫీలు గెలవడంతో మెగా ఈవెంట్ల సందర్భంగా భారత అభిమానులు తలెత్తుకోలేకపోతున్నారు. భారత్ చివరి సారిగా 2013 ఐసీసీ ట్రోఫీ నెగ్గింది. నాడు ధోని సారధ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2022 వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసీసీ టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటిముఖం పట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) జరుగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. అతి త్వరలో టీ20 జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి.. వన్డేలు, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను టీ20 జట్టు నుంచి తప్పించి వన్డే, టెస్ట్‌లకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం శిఖర్ ధవన్‌ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో, రోహిత్‌ను కూడా మున్ముందు వన్డేల్లో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రోహిత్.. టీ20ల్లో, టెస్ట్‌ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం, వయసు మీదపడటం, ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్‌పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. రోహిత్‌ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే.. ఈ ఫార్మాట్‌పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్‌కప్‌ను సాధించి పెట్టగలడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోత పడటంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమతం కావడం ఖాయమని తెలుస్తోంది. -
రోహిత్ పై వేటు తప్పదా ..?
-
ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఆస్ట్రేలియా వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్.. తాజాగా వన్డే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. గత నెలలో ఆరోన్ ఫించ్ టి20లపై దృష్టి వన్డేల నుంచి రిటైర్ కావడంతో అప్పటినుంచి కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై ఆసీస్ క్రికెట్లో చర్చ నడిచింది. తాజాగా నిరీక్షణకు తెరదించుతూ కమిన్స్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇక టి20 జట్టును ఆరోన్ ఫించ్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టి20 ప్రపంచకప్ తర్వాత ఫించ్ రిటైర్ అయ్యే అవకాశం ఉండడంతో మరో కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కమిన్స్‌ను మూడు ఫార్మట్లకు కెప్టెన్‌ను చేస్తారా లేక టి20 కెప్టెన్‌గా మరొకరిని నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఫించ్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు వన్డే జట్టు పగ్గాలు అప్పగిస్తారని భావించారు. కానీ 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా శాండ్ పేపర్ వివాదంలో చిక్కుకున్న వార్నర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. గత వారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చ జరిగింది. నిషేధాన్ని ఎత్తివేయడానికి అవసరమైన కోడ్ సవరణను సమీక్షించారు. కానీ కోడ్‌ను ఇంకా సవరించలేదు. దీంతో వార్నర్‌కు కెప్టెన్సీని అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో టెస్టుల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న కమిన్స్‌కే వన్డే బాధ్యతలను కూడా అప్పగించారు. జట్టులో స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లకు బదులు.. ఇద్దరు కెప్టెన్లు ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఆసీస్ బోర్డు కమిన్స్ వైపు మొగ్గు చూపింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్ కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జరుగుతుండగా.. జట్లన్నీ పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుంది. రాబోయే ఆరు నెలల కాలంలో ఆస్ట్రేలియా జట్టు 15 టెస్టులు ఆడనుంది. Pat Cummins has been named Australia's 27th ODI captain 🙌 pic.twitter.com/T0p02wwjiP — Cricket Australia (@CricketAus) October 17, 2022 చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు అద్భుతాలు.. దటీజ్ కోహ్లి -
బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై!
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ వన్డేలు, టి20ల నుంచి రిటైర్ అవుతున్నట్లు 36 ఏళ్ల మోర్గాన్ ప్రకటించాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో మధురానుభూతులు ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన మోర్గాన్... గాయంతో చివరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయంగా భావించా. ఇది బాధాకరమే అయినా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. కెరీర్ ఆరంభం నుంచి 2019 ప్రపంచకప్ గెలవడం వరకు నా కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ప్రస్తుత స్థితిలో జట్టు కూర్పు నుంచి నేను తప్పుకుంటే కొత్తగా వచ్చే కెప్టెన్‌కు జట్టును రాబోయే వరల్డ్‌కప్‌లలో సమర్థంగా నడిపించేందుకు తగినంత సమయం లభిస్తుందని భావించా. దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతా’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. ఒకదశలో తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు వెన్నెముకలా నిలిచిన మోర్గాన్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు. 2021 జనవరి నుంచి 48 ఇన్నింగ్స్‌లో అతను ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా ప్రత్యేక అధ్యాయం... డబ్లిన్‌లో పుట్టిన మోర్గాన్ 16 ఏళ్ల వయసులో సొంత దేశం ఐర్లాండ్ తరఫున అరంగేట్రం చేసి 2007 వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. మొత్తం 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇంగ్లండ్ జట్టుకు మారాడు. మొదటి నుంచి దూకుడైన బ్యాటింగ్ శైలి కలిగిన మోర్గాన్ 2010 టి20 వరల్డ్‌కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో కూడా సభ్యుడు. అప్పటి నుంచి అతను రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రెగ్యులర్‌గా మారిపోయాడు. అయితే అతని కెరీర్లో అసలు మలుపు కెప్టెన్‌గా వచ్చింది. 2015 వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అలిస్టర్ కుక్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మోర్గాన్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ప్రదర్శన పేలవంగా ఉన్నా... తర్వాతి నాలుగేళ్లలో అతను జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. అప్పటి వరకు వన్డేలను కూడా టెస్టుల తరహాలోనే ఆడుతూ వచ్చిన ఇంగ్లండ్... ఎన్నడూ లేని రీతిలో విధ్వంసకర జట్టుగా ఎదిగింది. వన్డేల్లో అతని హయాంలోనే ఇంగ్లండ్ ఐదుసార్లు 400కు పైగా పరుగులు సాధించగా, టాప్–3 ఆ జట్టు ఖాతాలోనే ఉన్నాయి. 2016 టి20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మోర్గాన్ కెరీర్ లో 2019 వన్డే వరల్డ్‌కప్ విజయం అత్యుత్తమ క్షణం. బ్యాటర్‌గా కూడా పలు ఘనతలు సాధించిన మోర్గాన్ పేరిటే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల (17) రికార్డు ఉంది. 16 టెస్టుల తర్వాత తన వల్ల కాదంటూ 2012లోనే అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇయాన్ మోర్గాన్ కెరీర్ ►248 వన్డేల్లో 39.29 సగటుతో 7,701 పరుగులు (14 సెంచరీలు, 47 అర్ధసెంచరీలు). ►115 అంతర్జాతీయ టి20ల్లో 136.17 స్ట్రయిక్‌రేట్‌తో 2458 పరుగులు (14 అర్ధ సెంచరీలు). చదవండి: IND vs IRE: ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్ "It's been the most enjoyable time of my life." Morgs' reflects on his incredible England career after announcing his international retirement 🏏#ThankYouMorgs — England Cricket (@englandcricket) June 28, 2022 -
Mithali Raj: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్?!
సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్‌లో మతమైన క్రికెట్‌కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. దీన్ని సువర్ణాధ్యాయంగా మలిచిన ఘనత కూడా ముమ్మాటికి ఆమె ఆటదే. 23 ఏళ్ల క్రితం ప్రభలేని మహిళా క్రికెట్‌కు కొత్త శోభ తెచ్చింది. ఆమె పరుగులు పెడుతున్నప్పుడు అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులో మన మహిళా క్రికెట్ లేదు. (ఆలస్యంగా బీసీసీఐ గొడుగు కిందకు వచ్చింది). ఆమె సెంచరీలు కొడుతుంటే... రూ. లక్షల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రైజ్‌మనీ రాలేదు. సిరీస్‌లను గెలిపిస్తే ఖరీదైన కారు (ప్లేయర్ ఆఫ్ ది సిరీస్) ఇవ్వలేని అమ్మాయిల క్రికెట్ గతి అది. ఇవేవీ తనకు దక్కకపోయినా... తను నమ్ముకున్న క్రికెట్‌కు 23 ఏళ్ల పాటు సేవలందించిన ధీరవనిత మిథాలీ. గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పు వెనుక మిథాలీ పాత్ర కూడా ఎంతో ఉంది. 23 ఏళ్ల క్రితం ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకంతో తారలా దూసుకొచ్చింది మిథాలీ రాజ్. ఈ 23 ఏళ్లలో మహిళల క్రికెట్లో తరాలు మారాయి. ఫార్మాట్లు మారాయి. ప్లేయర్లు మారారు. కానీ మిథాలీ ఆటలో మాత్రం మెరుపు తగ్గలేదు. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫునే కాకుండా మహిళల క్రికెట్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా పేరు సంపాదించింది. రోజువారీ ఖర్చులకు సరిపడా డబ్బులు లభించని సమయంలో తనకిష్టమైన భరత నాట్యాన్ని వదులుకొని క్రికెట్ పట్ల ప్రేమతో దానిని కెరీర్‌గా ఎంచుకున్న మిథాలీ టీవీల్లో వాణిజ్య ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగింది. ఆమె ఆటకు సంబంధించి అంకెలు, గణాంకాలను పరిశీలిస్తే మిథాలీని అభిమానులు ఆప్యాయంగా ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. Mithali Raj reflects on her glorious cricketing journey and the struggles behind it 📽️ pic.twitter.com/NwW3q5bukE — ICC (@ICC) June 8, 2022 అంచెలంచెలుగా... హైదరాబాద్ నగరంలోని సెయింట్ జాన్స్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ ఆ తర్వాత వేర్వేరు వయో విభాగాల్లో రాణిస్తూ తన ప్రత్యేకత చాటుకుంది. మహిళల క్రికెట్‌కు ఏమాత్రం గుర్తింపులేని సమయంలో దానిని కెరీర్‌గా ఎంచుకోవడం పెద్ద సాహసమే. అయితే మిథాలీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ తమ కూతురిని ఎల్లవేళలా ప్రోత్స హించారు. 1999లో వన్డే కెరీర్‌ను శతకంతో మొదలుపెట్టిన మిథాలీ... 2002లో టెస్టుల్లో అరంగేట్రం చేసింది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచినా... మూడో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మిథాలీకి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. కెప్టెన్‌గా అదుర్స్... 2003 వచ్చేసరికి భారత జట్టులో మిథాలీ స్థానం సుస్థిరమైపోయింది. 2005లో ఆమెకు తొలిసారి నాయకత్వ బాధ్యతలు లభించాయి. మిథాలీ కెప్టెన్సీలో భారత జట్టు 2005 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో భారత జట్టు ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీలు ఉన్నాయి. అందని ద్రాక్ష... వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును (పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి) రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ రాజ్ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మాత్రం ముద్దాడలేకపోయింది. ఆమె కెరీర్లో ఇది లోటుగా ఉండిపోనుంది. 2005 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్... 2017 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. అవమానం భరించి... విండీస్ ఆతిథ్యమిచ్చిన 2018 టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మిథాలీ రాజ్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం వివాదాస్పదమైంది. టోర్నీ సమయంలో అప్పటి చీఫ్ కోచ్ రమేశ్ పొవార్‌తోపాటు జట్టులోని ఇతర సీనియర్ సభ్యులు తను జట్టులో సభ్యురాలే కాదన్నట్లు ప్రవర్తించారని అప్పటి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సాబా కరీమ్‌లకు మిథాలీ లేఖ రాయడం పెను దుమారం రేపింది. ఈ వివాదం తర్వాత 2019లో టి20 నుంచి మిథాలీ వీడ్కోలు తీసుకుంది. వన్డే, టెస్టు ఫార్మాట్లపై మరింతగా దృష్టి సారించింది. కరోనా కారణంగా గత రెండేళ్లు పెద్దగా సిరీస్‌లు లేకపోయినా మిథాలీ ఆటలో నిలకడ కనబరుస్తూ వచ్చింది. ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలో భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా కనిపించినా... సమష్టి ప్రదర్శన లేకపోవడంతో భారత్ రౌండ్ రాబిన్ లీగ్‌లో ఐదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇదే చివరి ప్రపంచకప్ ఈ టోర్నీకి ముందే తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని మిథాలీ ప్రకటించింది. దాంతో టోర్నీ ముగిశాక మిథాలీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతుందని అందరూ భావించారు. కానీ మిథాలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ నెలలో శ్రీలంకలో పర్యటనకు భారత వన్డే, టి20 జట్లను బుధవారం ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మిథాలీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. భారత మహిళల క్రికెట్‌కు మిథాలీ రాజ్ సేవలకు గుర్తింపుగా ఆమె కోసం ప్రత్యేకంగా ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావించింది. అయితే దీనిపై మిథాలీ ఆసక్తి చూపలేదని సమాచారం. చదవండి: Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు! Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? View this post on Instagram A post shared by ICC (@icc) -
అలా ఈ ప్రయాణం అజేయ సెంచరీతో మొదలై హాఫ్ సెంచరీతో ముగిసింది!
Mithali Raj Retirement: రెండు దశాబ్దాలకుపైగా అలసటన్నది లేకుండా ఆడుతూ... లెక్కలేనన్ని కీర్తి శిఖరాలు అధిరోహిస్తూ... ‘ఆమె’ ఆటను అందలాన్ని ఎక్కిస్తూ... భావితరాలకు బాటలు వేస్తూ... ఇక బ్యాట్‌తో సాధించాల్సిందీ ఏమీ లేదని భావిస్తూ... భారత మహిళల క్రికెట్ మణిహారం మిథాలీ రాజ్ ఆటకు అల్విదా చెప్పింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మిథాలీ అత్యున్నత దశలో ఆట నుంచి వీడ్కోలు తీసుకుంది. న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ఈ మేరకు ఆమె ట్విటర్లో లేఖ విడుదల చేసింది. ఇన్నేళ్లు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గర్వంగా ఉందని పేర్కొన్న మిథాలీ... రెండు దశాబ్దాలకుపైగా సాగిన తన క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని... ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌ను ప్రతిభావంతులైన క్రీడాకారిణుల చేతుల్లో పెడుతున్నానని పేర్కొంది. ఇన్నేళ్లపాటు అనుక్షణం తన వెన్నంటే ఉండి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని 39 ఏళ్ల ఈ హైదరాబాద్ క్రికెటర్ తెలిపింది. 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ సెంచరీ (114 నాటౌట్)తో అద్భుత అరంగేట్రం చేసిన మిథాలీ... 2022 మార్చి 27న దక్షిణాఫ్రికాతో చివరి వన్డే (68 పరుగులు) ఆడింది. 23 ఏళ్ల ఆమె అంతర్జాతీయ కెరీర్ సెంచరీతో మొదలై అర్ధ సెంచరీతో ముగియడం విశేషం. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్న లక్ష్యంతో నా ప్రస్థానం మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ప్రతి ఒక సంఘటనతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. గత 23 ఏళ్లలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే నా క్రికెట్ కెరీర్‌కు ముగింపు వచ్చింది. అందుకే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్‌ను విజేతగా నిలబెట్టాలని కృషి చేశా. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ భవిష్యత్ ఉజ్వలంగా ఉందని... యువ క్రికెటర్ల చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తూ నా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఎల్లవేళలా నాకు మద్దతు ఇచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి, బోర్డు కార్యదర్శి జై షాకు ధన్యవాదాలు చెబుతున్నా. ఏళ్లపాటు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండటం గర్వకారణంగా ఉంది. నాయకత్వ బాధ్యతలు నన్ను వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డాయి. ప్లేయర్‌గా నా ప్రయాణం ముగిసినా... భవిష్యత్‌లో మహిళల క్రికెట్ ఉన్నతికి నా వంతుగా కృషి చేస్తా. ఇన్నాళ్లు నా వెన్నంటే నిలిచి ప్రేమ, ఆప్యాయతలు పంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. –మిథాలీ రాజ్ మిథాలీ కెరీర్ గ్రాఫ్... ఆడిన వన్డేలు 232 ►చేసిన పరుగులు: 7,805, నాటౌట్: 57 ►అత్యధిక స్కోరు: 125 నాటౌట్ ►సగటు: 50.68 ►సెంచరీలు: 7, అర్ధ సెంచరీలు: 64 ►క్యాచ్‌లు: 64, తీసిన వికెట్లు: 8 ఆడిన టెస్టులు 12 ►చేసిన పరుగులు: 699, నాటౌట్: 3 ►అత్యధిక స్కోరు: 214, సగటు: 43.68 ►సెంచరీలు: 1, అర్ధ సెంచరీలు: 4, క్యాచ్‌లు: 12 ఆడిన టి20లు 89 ►చేసిన పరుగులు: 2,364 ►అత్యధిక స్కోరు: 97 నాటౌట్ ►సగటు: 37.52 ►సెంచరీలు: 0 ►అర్ధ సెంచరీలు: 17, క్యాచ్‌లు: 19 చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం? You will continue to inspire millions, @M_Raj03! 👏 👏 We will miss your presence in the dressing room.#ThankYouMithali pic.twitter.com/qDBRYEDHAM — BCCI Women (@BCCIWomen) June 8, 2022 -
కేఎల్ రాహుల్‌కు బంపర్ ఆఫర్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఎంపిక
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బంపర్ ఆఫర్ కొట్టాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. గాయం నుంచి రోహిత్ శర్మ కోలుకోకపోవడంతో(ఫిట్నెస్ సాధించకపోవడంతో) కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ఐపీఎల్ 2021 దేశీయ స్టార్లు వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు.. రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు -
'చిన్ననాటి జ్ఞాపకాలు.. మా నాన్న షెడ్లో దొరికాయి'
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ పెద్దగా సక్సెస్ అయినట్లు అనిపించడం లేదు. అతను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆసీస్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయం సాధించిందే తప్ప ఐసీసీ ట్రోఫీలు గెలిచిన దాఖలాలు లేవు. ఫించ్ కెప్టెన్సీలో 2019 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ వరకు వెళ్లింది. అయితే ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌ను మాత్రం ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.ఈ టోర్నీలో బ్యాట్స్‌మన్‌గా ఫించ్ విఫలమైనప్పటికి.. కెప్టెన్సీలో అదరగొట్టాడు. అలా తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు తొలిసారి ఐసీసీ ట్రోఫీని అందించాడు.ఇక ఆస్ట్రేలియా ఆఖరిసారిగా 2015లో మైకెల్ క్లార్క్ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌ను గెలిచింది. చదవండి: మ్యాచ్ చివరి బంతికి ఊహించని ట్విస్ట్ ఇక తాజాగా ఆరోన్ ఫించ్ ఒక త్రోబ్యాక్ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ఫించ్ చిన్నతనంలో తాను వాడిన క్రికెట్ బ్యాట్లు ఉన్నాయి. నా చిన్నతనంలో నేను వాడిన బ్యాట్స్ అవి. ఇప్పుడు మా నాన్న షెడ్లో దొరికాయి.. ఇందులో మీ ఫెవరెట్ బ్యాట్ ఏదో చెప్పండి అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది. కాగా మూడోటెస్టు డిసెంబర్ 26న బాక్సింగ్ డే రోజున మొదలవ్వనుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు ఘోర అవమానం.. హోటల్ నుంచి గెంటేశారు Just found my old bats from when I was a kid in dads shed!! What was your favourite old bat? pic.twitter.com/A5qVHLzf73 — Aaron Finch (@AaronFinch5) December 23, 2021 -
రోహిత్‌పై గంగూలీ ఆసక్తికర వాఖ్యలు..
వైట్-బాల్ ఫార్మాట్లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడంతో భారత క్రికెట్లో కొత్త శకం ప్రారంభమైంది. టీ20ల్లో ఇప్పటికే భారత కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టిన హిట్‌మ్యాన్.. తాజాగా వన్డే కెప్టెన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించాడు. కాగా వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలగించి.. రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా మందికి షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షకుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. న్యూస్ 18 తో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు టైటిల్‌ను రోహిత్ అందించాడని గంగూలీ కొనియాడాడు. "భారత జట్టును విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్‌కు ఉంది. అందుకే సెలక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టు విజయాల కోసం రోహిత్ కొత్త వ్యూహాలు రచిస్తాడు. నాకు రోహిత్‌పై చాలా నమ్మకం ఉంది. ఐపీఎల్లో కెప్టెన్‌గా అతని రికార్డు అద్భుతం... ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లను అతడు అందించాడు. అతను కోహ్లి గైర్హాజరీలో 2018లో ఆసియా కప్‌లో భారత జట్టు సారథ్యం వహించాడు. కోహ్లి లేకుండానే టీమిండియా ట్రోఫిని కైవసం చేసుకుంది. కోహ్లి లేకుండా టైటిల్ గెలిచి రోహిత్ తన సత్తా ఎంటో నిరూపించాడు" అని గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం! -
సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం!
టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలిగించి రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. అయితే అనూహ్యంగా కోహ్లిని తప్పించి రోహిత్‌కు సారథ్య బాధ్యతలు బీసీసీఐ అప్పజెప్పింది. దీంతో కోహ్లి అసహానానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్లో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. ది టెలిగ్రాఫ్‌లో ప్రచురించిన కథనాలు ప్రకారం కోహ్లి తన పేరును ఉపసంహరించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లి ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇంకా వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించలేదు. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి! -
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌కు రాణించే సత్తా ఉంది: అజారుద్దీన్
Mohammed Azharuddin Reacts To Rohit Sharma Replacing Virat Kohli As ODI Captain: విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించడంపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. టీమిండియా వన్డే నూతన సారథిగా బాధ్యతలు చేపట్టినందుకు రోహిత్ శర్మకు సోషల్ మీడియా వేదికగా అతడు కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా రాణించే సత్తా రోహిత్‌కు ఉందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి తర్వాత భారత కొత్త వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. అతడికి జట్టును నడిపించే సామర్థ్యం ఉంది. కొత్త కెప్టెన్‌కు నా అభినందనలు" అని అజారుద్దీన్ తన "కూ" ఖాతాలో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి నుంచి టీ20 కెప్టెన్సీని రోహిత్ స్వీకరించాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలో భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. అంతే కాకుండా అజింక్య రహానె స్థానంలో భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-17న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: virat kohli: కోహ్లిని ఔట్ చేయడం నా కల: వరల్డ్ టీ20 నెం1 బౌలర్ -
ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్.. త్వరలోనే టెస్టులకు కూడా!
Rohit Sharma: From Not Being Part Of Squad To Limited Overs Captain Journey: రోహిత్ శర్మ... హిట్‌మ్యాన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.. ఇప్పటి వరకు రోహిత్ శర్మ కెరీర్‌ను పరిశీలిస్తే.. మూడు భాగాలుగా విభజించవచ్చు... ఆరంభంలో జట్టులో చోటు దక్కడమే గగనంగా మారిన వేళ.. ఒక్కొక్కటిగా సమస్యలు అధిగమిస్తూ... ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. 2007లో అడుగుపెట్టాడు... రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆరేళ్ల వరకు పెద్దగా ఆకట్టులేకపోయాడు. 80 మ్యాచ్‌లలో కలిపి కనీసం 2000 పరుగులు సాధించలేకపోయాడు. ఇక శ్రీలంకతో 2012లో జరిగిన ఒకానొక సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి రోహిత్ శర్మ చేసిన మొత్తం పరుగులు 13. దీంతో రోహిత్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ముఖ్యంగా 2011 వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కకపోవడంతో నిరాశకు లోనయ్యాడు రోహిత్. అలాంటి సమయంలో ధోని నిర్ణయం రోహిత్ కెరీర్‌ను మలుపు తిప్పింది. విధ్వంసకర ఓపెనర్.. పరుగుల ప్రవాహం.. 2013లో అప్పటి కెప్టెన్ ధోని.. రోహిత్ శర్మను టాపార్డర్‌కు ప్రమోట్ చేశాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్... టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత హిట్‌మ్యాన్‌కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్... ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ సాధించి వన్డేల్లో ఈ రికార్డు నమోదు చేసిన మూడో ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. అంతేకాదు... మూడు సార్లు ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా హిట్‌మ్యాన్‌దే(264). ఇక బ్యాటర్‌గా రోహిత్ శర్మ సాధించిన రికార్డులన్నింటి గురించి ప్రస్తావించాలంటే పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదు! టీమిండియాకు కొత్త రారాజు.. విరాట్ కోహ్లి గైర్హాజరీలో పలు మ్యాచ్‌లలో టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వహించిన రోహిత్ శర్మ... టీ20 వరల్డ్‌కప్-2021 ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ సారథిగా ఎంపికయ్యాడు. ఇక వన్డేల్లోనూ సారథిగా తన నియామకం ఖాయమేనన్న విశ్లేషణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు బీసీసీఐ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘భారత క్రికెట్‌కు కొత్త రాజు వచ్చేశాడు.. ఇక వెనుదిరిగి చూసేది లేదు’’అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీకి హిట్‌మ్యాన్ వందకు వంద శాతం అర్హుడు అని కామెంట్లు చేస్తున్నారు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంతో కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో తొలి సిరీస్ విజయం నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడు వన్డేల నిమిత్తం సౌతాఫ్రికా వెళ్తున్న తరుణంలో అక్కడ కూడా వైట్‌వాష్ చేసి సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అవును మరి... ఒకప్పుడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన రోహిత్.. రానున్న వరల్డ్‌కప్‌లో భారత సారథిగా వ్యవహరించనుండటం నిజంగా విశేషమే. ఇదిలా ఉంటే.. టెస్టు వైస్ కెప్టెన్‌గా కూడా రోహిత్‌కు ప్రమోషన్ దక్కిన నేపథ్యంలో త్వరలోనే ఆ ఫార్మాట్లో కూడా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: ODI Captaincy- Virat Kohli: అందుకే కోహ్లిపై వేటు వేశారు!.. మరీ ఇంత అవమానకరంగా.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా.. Really really disappointed of not being the part of the WC squad..I need to move on frm here..but honestly it was a big setback..any views! — Rohit Sharma (@ImRo45) January 31, 2011 -
వన్డే కెప్టెన్సీకి గుడ్ బై!
కేప్‌టౌన్:గతేడాది దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ గుడ్ బై చెప్పిన ఏబీ డివిలియర్స్.. ఇప్పుడు వన్డే సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో పాటు, ఇంగ్లండ్ పర్యటనలో కూడా ఏబీ కెప్టెన్సీలోని సఫారీ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో తన వన్డే కెప్టెన్సీ కి సంబంధించి ఏబీ డివిలియర్స్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇక వన్డే జట్టు పగ్గాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్ కు సంబంధించి ఆగస్టు నెలలో ఓ నిర్ణయం తీసుకుంటానని ముందుగానే తెలిపిన ఏబీ.. ఆ మేరకు కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. తన పదవికి రాజీనామా చేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్న ఏబీ.. టెస్టుల్లో, టీ 20 ల్లో కెప్టెన్ గా మెరుగైన ఫలితాలు సాధించిన డు ప్లెసిస్ కు వన్డే సారథ్య బాధ్యతల్ని అప్పగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ వేరే వ్యక్తికి కెప్టెన్సీ ఇచ్చినా అందుకు తనవంతు సహకారం ఉంటుందన్నాడు. ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్ గా చేయడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఏబీ తెలిపాడు. -
గంభీర్ స్థానంలో రిషబ్
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర క్రికెట్ జట్టు కెప్టెన్ గా గౌతం గంభీర్ ను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ రాష్ట్ర వన్డే కెప్టెన్‌గా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలం ఢిల్లీ కెప్టెన్‌గా ఎవర్ని నియమించాలనే దానిపై పెద్దగా అన్వేషించకపోయినా, ఆ స్థానానికి రిషబ్ అయితేనే సరిగ్గా ఉంటుందని ఢిల్లీ సెలక్షన్ కమిటీ భావించింది. ఈ మేరకు రిషబ్ ను ఢిల్లీ వన్డే కెప్టెన్ గా నియమించినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్ తెలిపారు. తమ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గంభీర్ కు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 'నిజంగా చెప్పాలంటే విజయ్ హజారే టోర్నీలో భాగంగానే రిషబ్ గురించి ప్రస్తావన వచ్చింది. గంభీర్ తరువాత మా రాష్ట్ర కెప్టెన్ ఎవరు అనేది దానిపై చర్చించాం. దానిలో భాగంగానే వచ్చే వన్డే టోర్నీకి రిషబ్ ను కెప్టెన్ గా నియమించాం. గౌతం గంభీర్ మార్గదర్శకత్వంలో రిషబ్ రాటు దేలతాడు. విజయ్ హజారే టోర్నీ రిషబ్ కెప్టెన్సీ స్కిల్స్ కు పరీక్ష' అని ఢిల్లీ సెలక్టర్ నిఖిల్ చోప్రా పేర్కొన్నారు. -
పాక్ వన్డే కెప్టెన్‌గా అజహర్ అలీ
కరాచీ: జాతీయ జట్టులో రెండేళ్లుగా చోటు దక్కించుకోలేక పోతున్న 30 ఏళ్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీని ఏకంగా పాకిస్తాన్ వన్డే కెప్టెన్‌గా నియమించారు. మిస్బా ఉల్ హక్ స్థానంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయం తీసుకుంది. కెరీర్లో కేవలం 14 వన్డేలే ఆడిన అలీకి ప్రపంచకప్ పాక్ జట్టులోనూ చోటు దక్కలేదు. -
వన్డే కెప్టెన్సీ వదలను: కుక్
బర్మింగ్‌హామ్: ఇంగ్లీషు గడ్డపై ధోనిసేన వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఇంగ్లండ్ కెప్టెన్ ఆలియస్టర్ కుక్ పై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడంతో అతడు విపరీత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అయితే తాను వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో నాయకత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదని వెల్లడించాడు. బోర్డు తనను కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతానని కుక్ తెలిపాడు. మూడున్నరేళ్లుగా కెప్టెన్ గాకొనసాగుతున్నానని, ఆస్ట్రేలియాలో వన్డే వరల్డ్ కప్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ మరో వన్డే మిగిలుండగానే చేజార్చుకుంది.