బాబర్ ఆజం
PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది.
సెమీస్ కూడా చేరకుండా నిష్క్రమించడంతో
కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు.
అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, టెస్టులకు షాన్ మసూద్‌లను సారథులుగా ఎంపిక చేశారు.
ఘోర పరాజయాలు
ఈ క్రమంలో షాన్ మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్ సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి.
ఆఫ్రిదిపై వేటు.. మసూద్ కొనసాగింపు!
ఇక షాహిన్ ఆఫ్రిది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు బాబర్ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు.
అయితే, టెస్టులకు మాత్రం షాన్ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్ జట్టు తదుపరి ఏప్రిల్ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు.
చదవండి: #Mayank Yadav: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్?
Babar Azam appointed as white-ball captain
— Pakistan Cricket (@TheRealPCB) March 31, 2024
Following unanimous recommendation from the PCB’s selection committee, Chairman PCB Mohsin Naqvi has appointed Babar Azam as white-ball (ODI and T20I) captain of the Pakistan men's cricket team. pic.twitter.com/ad4KLJYRMK
Comments
Please login to add a commentAdd a comment