పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి షాహీన్ షా ఆఫ్రిది తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత బాధ్యత వహిస్తూ అఫ్రిది తన పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అఫ్రిదికి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ,జాతీయ సెలెక్టర్ల మధ్య పెద్దగా కమ్యూనికేషన్ కూడా లేనిట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో పీసీబీ తీరు పట్ల అఫ్రిది ఆంసృప్తితో ఉన్నట్లు పలురిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి సాధారణ ఆటగాడిగా కొనసాగాలని షాహీన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజాం పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం.
వచ్చేనెల 18నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో బాబర్ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో జట్టు దారుణ వైఫల్యం తర్వాత మూడు ఫార్మాట్లలో ఆజమ్ కెప్టెన్సీపై వేటు పడింది.
ఆ తర్వాత టీ20 కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిది, టెస్టు కెప్టెన్‌గా షాన్ మసూద్‌ను పీసీబీ నియమించింది. కానీ వీరిద్దరూ తమ మార్క్ చూపిచండంలో విఫలమయ్యారు. మసూద్ సారధ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను పాక్ కోల్పోగా.. షాహీన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 4-1 సిరీస్ ఓటమిని చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment