పాకిస్తాన్ జట్టులో ప్రస్తుతం శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు బాబర్ ఆజం స్థానంలో షాదాబ్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). బాబర్ ఆజంతో పాటు పాక్ నెంబర్‌వన్ బౌలర్ షాహిన్ అఫ్రిది సహా ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, మహ్మద్ రిజ్వాన్‌లను రెస్ట్ పేరుతో పక్కనబెట్టింది. పాకిస్తాన్ జట్టును కొత్తగా తయారు చేయాలన్న ఉద్దేశంతో పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ ఆధ్వర్యంలోని బోర్డు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.
అయితే పీసీబీ చేస్తున్న మార్పులపై పాక్ మాజీ క్రికెటర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పాకిస్తాన్ జట్టు ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్(#Rest In Peace) మోడ్‌లో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లను పక్కనబెట్టడం నచ్చని లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
''కొన్నాళ్లుగా మన ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో, అవార్డులు గెలుచుకోవడంలో ముందుంటున్నారు. అంతేకాదు బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిదిలు గతేడాది ఐసీసీ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ఇది వాళ్లకు(పీసీబీ) నచ్చలేదు. అందుకే బోర్డు రూపంలో తమకు హక్కు ఉందంటూ నచ్చనివారిపై వేటు వేసేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఫామ్‌లో ఉన్న.. విశ్రాంతి అవసరం లేని ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తూ.. 70, 80 ఏళ్ల వయసులో ఉన్న బోర్డు సభ్యులు రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో అజమాయిషీ చెలాయిస్తూ పాకిస్తాన్ క్రికెట్‌ను మార్చాలనుకుంటున్నారు.
అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ రెస్ట్ ఇన్ పీస్‌లో ఉందని చెప్పగలను. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ మొత్తం జట్టునే ప్రక్షాళన చేయాలనుకోవడం మూర్కత్వం కిందకు వస్తుంది. జట్టులోకి ఎవరైతే కొత్త ఆటగాళ్లు వచ్చారో వారిని అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు ఆడనివ్వండి.. కానీ సీనియర్లతో కాంబినేషన్‌తో ఆడించడం మంచింది. ఈ విషయంలో మీడియా కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ నాశనానికి ఇదే తొలి అడుగులా కనిపిస్తుంది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అప్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..
షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఆజమ్ ఖాన్ (వికెట్‌కీపర్), ఫహీమ్ అష్రాఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇహసానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హరీస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీం షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయాబ్ తాహిర్, జమాన్ ఖాన్
చదవండి: పాకిస్తాన్ క్రికెట్‌లో సమూల మార్పులు.. తొలుత కెప్టెన్, తాజాగా కోచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment