![పాక్ వన్డే కెప్టెన్‌గా అజహర్ అలీ](/styles/webp/s3/article_images/2017/09/2/81427744298_625x300.jpg.webp?itok=khE1LPPU)
పాక్ వన్డే కెప్టెన్‌గా అజహర్ అలీ
కరాచీ: జాతీయ జట్టులో రెండేళ్లుగా చోటు దక్కించుకోలేక పోతున్న 30 ఏళ్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీని ఏకంగా పాకిస్తాన్ వన్డే కెప్టెన్‌గా నియమించారు. మిస్బా ఉల్ హక్ స్థానంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయం తీసుకుంది. కెరీర్‌లో కేవలం 14 వన్డేలే ఆడిన అలీకి ప్రపంచకప్ పాక్ జట్టులోనూ చోటు దక్కలేదు.