![BCCI Announces 18 Member Indian Squad For ODI Series Against South Africa - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/31/Untitled-7.jpg.webp?itok=KDX3YYIs)
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బంపర్ ఆఫర్ కొట్టాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు టీమిండియా సారధిగా ఎంపికయ్యాడు. గాయం నుంచి రోహిత్ శర్మ కోలుకోకపోవడంతో(ఫిట్‌నెస్ సాధించకపోవడంతో) కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ఐపీఎల్ 2021 దేశీయ స్టార్లు వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చహల్, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా(వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
చదవండి: అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఆటగాళ్లు.. రేసులో ఇద్దరు పాక్ ఆటగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment