Mohammed Azharuddin Reacts To Rohit Sharma Replacing Virat Kohli As ODI Captain: విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించడంపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ స్పందించాడు. టీమిండియా వన్డే నూతన సారథిగా బాధ్యతలు చేపట్టినందుకు రోహిత్ శర్మకు సోషల్ మీడియా వేదికగా అతడు కృతజ్ఞతలు తెలిపాడు. కెప్టెన్‌గా రాణించే సత్తా రోహిత్‌కు ఉందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లి తర్వాత భారత కొత్త వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మపై నాకు చాలా ఆశలు ఉన్నాయి. అతడికి జట్టును నడిపించే సామర్థ్యం ఉంది. కొత్త కెప్టెన్‌కు నా అభినందనలు" అని అజారుద్దీన్ తన "కూ" ఖాతాలో పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచ కప్ తర్వాత కోహ్లి నుంచి టీ20 కెప్టెన్సీని రోహిత్ స్వీకరించాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలో భారత తదుపరి వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది. అంతే కాకుండా అజింక్య రహానె స్థానంలో భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలగించి రోహిత్ శర్మని నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-17న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా
చదవండి: virat kohli: కోహ్లిని ఔట్ చేయడం నా కల: వరల్డ్ టీ20 నెం1 బౌలర్
Comments
Please login to add a commentAdd a comment