Mohammad Azharuddin Slams Virat And Rohit: టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లి(టెస్ట్), రోహిత్ శర్మ(పరిమిత ఓవర్ల ఫార్మాట్)లు వివిధ కారణాల చేత దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడంపై టీమిండియా మాజీ సారధి మహ్మద్ అజహారుద్దీన్ స్పంచించాడు. ట్విటర్ వేదికగా కోహ్లి, రోహిత్‌లపై విరుచుకుపడ్డాడు. జాతీయ జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారిద్దరికి హితవు పలికాడు.
Virat Kohli has informed that he's not available for the ODI series & Rohit Sharma is unavailable fr d upcoming test. There is no harm in takin a break but d timing has to be better. This just substantiates speculation abt d rift. Neither wil be giving up d other form of cricket.
— Mohammed Azharuddin (@azharflicks) December 14, 2021
ఈగోలకు పోయి, ఒకరి సారధ్యంలో మరొకరు ఆడేందుకు సుముఖంగా లేరన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని, కీలక సిరీస్‌లకు ముందు ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదని అజహర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో బ్రేక్ తీసుకోవడం తప్పేమీ కాదని, పంతాలకు పోయి జట్టు పరువును బజారుకీడ్చడమే సరికాదని అసహనం వ్యక్తం చేశాడు.
కాగా, టీమిండియా కెప్టెన్సీ వివాదంపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో గాయం కారణంగా రోహిత్, కూతురు పుట్టినరోజును కారణంగా చూపి కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై కోహ్లి, రోహిత్ అభిమానుల మధ్య సోషల్‌మీడియా వేదికగా చిన్న సైజ్ యుద్ధమే నడుస్తుంది.
చదవండి: యాషెస్ సిరీస్‌లో తెలంగాణ బిడ్డ..
Comments
Please login to add a commentAdd a comment