Anurag Thakur Comments On Rohit And Virat Equation: టీమిండియా కెప్టెన్ల(విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ) వ్యవహారంపై సోషల్‌మీడియా వేదికగా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆట కంటే ఆటగాళ్లు గొప్పవాళ్లేమీ కాదంటూ రోహిత్, విరాట్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిత్ అయినా విరాట్ అయినా బీసీసీఐ నిర్ణయాన్ని గౌరవించి, దానికి కట్టుబడి ఉండాలన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వ్యవహారాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
కాగా, టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ బీసీసీఐ ప్రకటించిన అనంతరం రోహిత్, విరాట్‌ల మధ్య గ్యాప్‌పై సోషల్‌మీడియాలో రకారకాల కథనాలు ప్రచారమయ్యాయి. అయితే, ఈ విషయమై తాజాగా విరాట్ స్పందించాడు. రోహిత్‌తో తనకెటువంటి విభేదాలూ లేవంటూ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ సారధ్యంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమంటూ ప్రకటించాడు.
అయితే, ఈ సందర్భంగా కోహ్లి మరో బాంబ్ పేల్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించేముందు బీసీసీఐ బాస్ గంగూలీ తనను సంప్రదించాడన్న వార్తలు అవాస్తవమని, వన్డే కెప్టెన్సీ తొలగింపుపై చివరి నిమిషంలో నాకు సమాచారమిచ్చారని, ఈ విషయంలో బీసీసీఐ తనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని మరో చర్చకు తావిచ్చేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: Virat Kohli: గంగూలీపై కోహ్లి సంచలన వ్యాఖ్యలు.. నేను వన్డే కెప్టెన్ కాదని చెప్పారు!
Comments
Please login to add a commentAdd a comment