ముంబై: రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికైన వెంటనే తనను అభినందిస్తూ టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు పంపిన సందేశాలు ఎన్నటికీ మరువలేనని ఆర్‌ఆర్ నూతన సారధి సంజూ సాంసన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అత్యున్నత శిఖరాలను అదిరోహించిన వారు.. తనకు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు.
ఆర్‌ఆర్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం తన అదృష్టమని, తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యానికి జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సంగక్కరతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని వెల్లడించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం అంతగా అనుభవంలేని తనకు సంగక్కర లాంటి భాగస్వామి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్ తొలి ఎడిషన్(2008)లో ఛాంపియన్‌గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆతరువాత మళ్లీ అదృష్టం కలిసిరాలేదు. మధ్యలో రెండేళ్లు నిషేధానికీ గురై క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమైన ఆ జట్టు.. చాలామంది విదేశీ, స్వదేశీ సీనియర్లను ప్రయత్నించినా టైటిల్ మాత్రం అందని దాక్షాలానే మిగిలింది. అయితే, ఈ సీజన్ వేలానికి ముందు స్టీవ్ స్మిత్‌ను వదిలించుకున్న ఆర్‌ఆర్ జట్టు సంజు సాంసన్ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అతనికి మద్దతుగా నిలిచేందుకు క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర్‌ను నియమించుకుంది. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆర్‌ఆర్ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: బయో బబుల్ కష్టమే.. అయినా భారత క్రికెటర్లు తట్టుకోగలరు
Comments
Please login to add a commentAdd a comment