
Courtesy: IPL Twitter
ముంబై: ఆర్‌సీబీ, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇయన్ బిషప్ కాయిన్ రోల్ చేయమని సామ్సన్‌ను అడిగాడు. సామ్సన్ కాయిన్ రోల్ చేయగా కోహ్లి హెడ్స్ అని కాల్ ఇచ్చాడు. హెడ్ పడడంతో కోహ్లి టాస్ గెలిచినట్లు బిషప్ చెప్పగా.. అది వినిపించుకోని కోహ్లి .. కంగ్రాట్స్ సామ్సన్.. అని చెప్పాడు. అయితే సామ్సన్‌కు కోహ్లి ఏం చెప్పాడో అర్థం కాలేదు. ఇంతలో తేరుకున్న కోహ్లి .. ''ఏయ్ సామ్సన్ టాస్ నేను గెలిచాను..'' అంటూ ముందుకు వచ్చాడు. కోహ్లి చర్యతో సామ్సన్, బిషప్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు.
కోహ్లి చేసిన పని నవ్వు తెప్పించేలా ఉండడంతో వైరల్‌గా మారింది. ఏంటి కోహ్లి టాస్ గెలిచానన్న సంగతి మరిచిపోయావా.. ఇప్పుడు టాస్ గెలిచానని మర్చిపోయాడు.. తర్వాత మ్యాచ్ గెలిచామని మరిచిపోతాడేమో.. అంటూ కామెంట్లతో రెచ్చిపోయారు. కాగా టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే అతని నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తున్నారు. ప్రస్తుతం రాజస్తాన్ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
చదవండి: ఐపీఎల్ 2021: సిరాజ్ దెబ్బ.. మూడో వికెట్ డౌన్
Hahaha the best #RCBvRR pic.twitter.com/GB55I268th
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) April 22, 2021
Comments
Please login to add a commentAdd a comment