ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 16.3 ఓవర్లలోనే చేధించి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్(52 బంతుల్లో 101 పరుగులు) మెరుపు సెంచరీతో ఆకట్టుకోగా.. కోహ్లి 72 పరుగులతో రాణించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు రాజస్తాన్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయారు. పడిక్కల్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండగా.. కోహ్లి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.
అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శివమ్ దూబే(46) రియన్ పరాగ్(25)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 109 పరుగుల వద్ద పరాగ్ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్ తెవాటియా(40, 23 బంతులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే దూబే, తెవాటియాలు వెనుదిరిగిన తర్వాత రాజస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్ చెరో 3 వికెట్లు తీయగా.. జేమిసన్, రిచర్డ్‌సన్, సుందర్‌లు తలా ఒక వికెట్ తీసింది.
కోహ్లి అర్థశతకం.. ఆర్‌సీబీ 161/0
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ చేజింగ్‌లో మెరుపులు మెరిపిస్తుంది. 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో కోహ్లి అర్థశతకం సాధించాడు. కాగా పడిక్కల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ 41 బంతుల్లోనే 85 పరుగులతో ఆడుతున్నాడు. ఆర్‌సీబీ ప్రస్తుతం 15 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 162 పరుగులు చేసింది.
పడిక్కల్ మెరుపులు.. ఆర్‌సీబీ 112/0
ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. రాహుల్ తెవాటియా వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో పడిక్కల్ వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కోహ్లి 31 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న ఆర్‌సీబీ
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ దూకుడుగా ఆడుతుంది, క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో పడిక్కల్ రెండు, కోహ్లి ఒక ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం రాజస్తాన్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. కోహ్లి 19, పడిక్కల్ 47 పరుగులతో ఆడుతున్నారు.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. కోహ్లి 9, పడిక్కల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అంతకముందు రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది
ఆర్‌సీబీ టార్గెట్ 178
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో శివమ్ దూబే(46) రియన్ పరాగ్(25)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 109 పరుగుల వద్ద పరాగ్ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన రాహుల్ తెవాటియా(40, 23 బంతులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే దూబే, తెవాటియాలు వెనుదిరిగిన తర్వాత రాజస్తాన్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్ చెరో 3 వికెట్లు తీయగా.. జేమిసన్, రిచర్డ్‌సన్, సుందర్‌లు తలా ఒక వికెట్ తీసింది. అంతకముందు రాజస్తాన్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో తెవాటియా(40) ఔట్ కాగా..హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మోరిస్(10) చహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 170/9గా ఉంది.
దూబే ఔట్.. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను తన బ్యాటింగ్‌తో నిలబెట్టిన శివమ్ దూబే(46) కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. తెవాటియా (18), మోరిస్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
పరాగ్ ఔట్, రాజస్థాన్ 109/5
రాజస్థాన్ రాయల్స్ 109 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన పరాగ్ ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 14 ఓవర్ మూడో బంతికి చహల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
10 ఓవర్లలో రాజస్థాన్ స్కోరు 70/4
రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. శివం దూబే (22), రియాన్ పరాగ్(6)లు క్రీజ్‌లో ఉన్నారు. సామ్సన్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత పరాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. రాజస్థాన్ కోల్పోయిన నాలుగు వికెట్లలో సిరాజ్ రెండు వికెట్లు సాధించగా, జెమీసన్, వాషింగ్టన్ సుందర్‌లకు తలో వికెట్ దక్కింది.
రాజస్తాన్ రాయల్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. సుందర్ వేసిన ఇన్నింగ్స్ 8 ఓవర్లో సామ్సన్(21) మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. దూబే(7), పరాగ్(3) క్రీజులో ఉన్నారు.
సిరాజ్ దెబ్బ.. మూడో వికెట్ డౌన్
ఆర్‌సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో సిరాజ్ వేసిన యార్కర్ మిల్లర్ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. ఆర్‌సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటివ్వకపోవడంతో ఆర్‌సీబీ రివ్యూ కోరింది. రిప్లేలో బంతి ఇంపాక్ట్ వికెట్‌ను తాకుతూ వెళ్లడంతో మిల్లర్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్తాన్ 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.
రెండో వికెట్ డౌన్
మనన్ వోహ్రా రూపంలో రాజస్తాన్ రాయల్స్ 16 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కైల్ జేమిసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వోహ్రా రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రాజస్తాన్ స్కోరు 4 ఓవర్లలో 17/2గా ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన బట్లర్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో గురువారం ఆర్‌సీబీ, రాజస్తాన్ రాయల్స్ ముంబై వేదికగా తలపడుతున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న ఆర్‌సీబీని రాయల్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్, ఫీల్డింగ్ ఎంచుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ అన్నింటిలోనూ విజయం సాధించగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి ఒకదానిలో మాత్రమే గెలిచింది.
ఇక ఇరుజట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే.. బెంగళూరు, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోగా.. మిగిలిన 20 మ్యాచ్‌లకిగానూ చెరో 10 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇరు జట్లు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలోనూ ఆర్‌సీబీనే విజయం వరించింది.
ఇక బలబలాల విషయానికి వస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. కోహ్లి, ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండగా.. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి తిరుగులేదు. పేసర్లు సిరాజ్, హర్షల్ పొదుపుగా బౌలింగ్ చేస్తునే వికెట్లు తీస్తున్నారు. మరోవైపు రాజస్తాన్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శాంసన్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలయ్యాడు. మిడిల్ ఆర్డర్‌లో జోస్ బట్లర్ రాణిస్తున్నాఅతనికి సహకరించేవారు కరువయ్యారు. మోరిస్, మిల్లర్‌లతో లోయర్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది. అయితే రాజస్తాన్ బౌలింగ్ విభాగం మాత్రం అంత బలంగా కనిపించడం లేదు.
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లి(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కేన్ రిచర్డ్‌సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, షెహబాజ్ అహ్మద్, జెమీసన్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్
రాజస్థాన్ రాయల్స్: సంజూ సామ్సన్(కెప్టెన్), బట్లర్, వోహ్రా, శివమ్ దూబే, మిల్లర్, రియాన్ పరాగ్, తెవాతియా, మోరిస్, శ్రేయాస్ గోపాల్, సకారియా, ముస్తాఫిజుర్
Comments
Please login to add a commentAdd a comment