Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. రాజస్తాన్ బ్యాటింగ్‌లో సామ్సన్ 42 పరుగులతో రాణించగా.. మిల్లర్ 24 పరుగులు సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, మావి, ప్రసిధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.కేకేఆర్ బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్‌లు చెరో వికెట్ తీశారు.
విజయం దిశగా రాజస్తాన్
134 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ విజయం దిశగా సాగుతుంది. సామ్సన్ 39, మిల్లర్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 17 ఓవర్లలో 121/4గా ఉంది. అంతకముందు తెవాటియా(5) రూపంలో రాజస్తాన్ రాయల్స్ 100 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా రాజస్తాన్ విజయానికి ఇంకా 33 బంతుల్లో 30 పరుగులు కావాల్సి ఉంది. సామ్సన్ 36, మిల్లర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం రాజస్తాన్ 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతికి 22 పరుగులు చేసిన దూబే ప్రసిధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 85/3గా ఉంది.
9 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు 77/2
రాజస్తాన్ రాయల్స్ 9 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సామ్సన్ 27, దూబే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 66 బంతుల్లో 57 పరుగులు కావాల్సి ఉంది.
రాజస్తాన్ రెండో వికెట్ డౌన్
రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జైస్వాల్.. శివమ్ మావి వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఐదో బంతికి నాగర్‌కోటికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. సామ్సన్ (15), దూబే(13) క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ బట్లర్(5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. మిథున్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ స్కోరు 36/1గా ఉంది.
రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ 134
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. రెండు ఓవర్ల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్‌లు చెరో వికెట్ తీశారు.అంతకముందు కేకేఆర్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మొదట రసెల్(9) మిల్లర్‌కు క్యాచ ఇచ్చి వెనుదిరగ్గా.. తర్వాత దినేశ్ కార్తిక్(25) చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కమిన్స్(5), మావి(4) క్రీజులో ఉన్నారు.
15 ఓవర్లలో కేకేఆర్ 93/4
15 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. త్రిపాఠి (36), దినేశ్ కార్తీక్(14)లు క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు గిల్, రానా, నరైన్, ఇయాన్ మోర్గాన్ వికెట్లను కేకేఆర్ నష్టపోయింది. ఈ వికెట్లలో రానా(22) ఫర్వాలేదనించగా మిగతా వారు విఫలమయ్యారు. మోర్గాన్ డైమండ్ డక్‌గా ఔట్ కావడంతో కేకేఆర్ ఒత్తిడిలో పడింది. త్రిపాఠి బంతిని ఫేస్ చేసి సింగిల్‌కు యత్నించగా, మోర్గాన్ రనౌట్ అయ్యాడు. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్‌కు సింగిల్ తీద్దామని పిలిచాడు. కాగా, బంతి అక్కడే ఉందని గ్రహించిన త్రిపాఠి వద్దని వారించగా, అప్పటికే మోర్గాన్ క్రీజ్‌ను వీడి ముందుకొచ్చేశాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న క్రిస్ మోరిస్.. మోర్గాన్‌ను రనౌట్ చేశాడు.
ఇయాన్ మోర్గాన్ డైమండ్ డక్
కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. నరైన్ మూడో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్.. కనీసం బంతిని కూడా ఆడకుండానే ఔటయ్యాడు. 11 ఓవర్ రెండో బంతికి పరుగు కోసం యత్నించి డైమండ్ డక్ అయ్యాడు. త్రిపాఠి బంతిని ఫేస్ చేసి సింగిల్‌కు యత్నించగా, మోర్గాన్ రనౌట్ అయ్యాడు. దాంతో 61 పరుగుల వద్ద కేకేఆర్ నాల్గో వికెట్‌ను కోల్పోయింది.
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
కేకేఆర్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను నష్టపోయింది. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద ఉండగా నితీష్ రానా(22) ఔట్ కాగా, ఆపై సునీల్ నరైన్(6) పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. ఉనాద్కత్ వేసిన 10 ఓవర్ ఐదో బంతికి జైస్వాల్‌కు క్యాచ్ నరైన్ ఔటయ్యాడు. దాంతో 54 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్‌ను నష్టపోయింది.
నితీష్ రానా(22) ఔట్, కేకేఆర్ 45/2
కేకేఆర్ రెండో వికెట్‌ను కోల్పోయింది. నితీష్ రానా(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. సకారియా వేసిన 9 ఓవర్ తొలి బంతికి రానా ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్‌ను సష్టపోయింది.
గిల్ రనౌట్.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
కేకేఆర్ 24 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన గిల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ నాలుగో బంతిని ఆడిన గిల్ లేని పరుగు కోసం ప్రయత్నించాడు. కవర్స్‌లో ఉన్న బట్లర్ బంతిని అందుకొని వేగంగా పరిగెత్తి వికెట్లను గిరాటేశాడు. అప్పటికి గిల్ క్రీజుకు చాలా దూరంలో ఉండిపోవడంతో క్లియర్ రనౌట్ అని తేలింది. ప్రస్తుతం 8 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 45/1గా ఉంది. రానా 22, త్రిపాఠి 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
4 ఓవర్లలో కేకేఆర్ స్కోరు 21/0
రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నిలకడగా ఆడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రానా 10, గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా తొలి మ్యాచ్‌లోనే గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలను నమోదు చేసింది. అయితే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంత పని చేసిన కేకేఆర్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్ ఆ తర్వాత మ్యాచ్‌లో గెలిచినా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. కాగా ఈ మ్యాచ్‌కు కేకేఆర్ జట్టులో నాగర్ కోటి స్థానంలో శివమ్ మావి.. రాజస్తాన్ జట్టు నుంచి వోహ్రా స్థానంలో జైస్వాల్, శ్రేయాస్ గోపాల్ స్థానంలో ఉనాద్కట్ తుది జట్టులోకి వచ్చారు.
ఇక ఐపీఎల్‌లో ఇరుజట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే.. ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌ల్లో తలపడగా.. 12 మ్యాచ్‌ల్లో కేకేఆర్ గెలవగా.. 10 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి చూసినా ఈ రెండు జట్లు తలపడిన ఏ మ్యాచ్‌లోనూ 200 పరుగుల స్కోరు నమోదు కాలేదు. కాగా ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్‌నే విజయం వరించింది.
తుది జట్లు:
కేకేఆర్: నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, మోర్గన్, సునీల్ నరైన్, దినేశ్ కార్తిక్, అండ్రీ రసెల్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి, ప్రసిద్ధ కృష్ణ
రాజస్థాన్ రాయల్స్: సంజూ సామ్సన్(కెప్టెన్), బట్లర్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, మిల్లర్, రియాన్ పరాగ్, తెవాతియా, మోరిస్, ఉనాద్కట్, సకారియా, ముస్తాఫిజుర్
Comments
Please login to add a commentAdd a comment