Courtesy: IPL Twitter
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాజస్తాన్ విధించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన పడిక్కల్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విజృంభించిన పడిక్కల్ 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.
ఈ నేపథ్యంలో పడిక్కల్ ఆటతీరుపై ప్రశంసలు కురుస్తున్న వేళ రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ పడిక్కల్ షూలేస్ కట్టడం వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సమయంలో పడిక్కల్ షూలేస్ ఊడిపోయింది. ఇంతలో అది గమనించిన బట్లర్ పడిక్కల్ దగ్గరకు వచ్చి షూలేస్ కట్టి సహాయం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ టీ20 డాట్‌కామ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటే ఇదే.. అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ఆర్‌సీబీ ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ముంబై వేదికగా ఏప్రిల్ 25న సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి: ముందు సెంచరీ పూర్తి చేసి ఆ మాట చెప్పు..!
టాస్ గెలిచి మరిచిపోయాడు.. ఏంటి కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment