Courtesy: IPL Twitter
ముంబై: మ్యాచ్‌లో ఒక జట్టు ఓడిపోతే సోషల్ మీడియాలో వారిపై ట్రోల్స్ రావడం సహజంగా చూస్తుంటాం. ప్రత్యర్థి జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయినప్పుడు నెటిజన్లు ఓడిన జట్టుపై రకరకాల మీమ్స్, కామెంట్స్‌తో రెచ్చిపోవడం కూడా చూస్తుంటాం. కానీ రాజస్తాన్ రాయల్స్ మాత్రం నెటిజన్లకు ఆ అవకాశం ఇవ్వకుండా వారినే వారు ట్రోల్ చేసుకున్నారు. రాజస్తాన్ రాయల్స్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ పడిక్కల్ మెరుపు సెంచరీకి తోడు కోహ్లి కూడా అద్భుతంగా ఆడడంతో పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఓటమితో రాజస్తాన్ రన్‌రేట్ దారుణంగా పడిపోవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
అయితే తాము ఓడిపోయామన్న బాధేమో.. రాజస్తాన్ రాయల్స్ తనను తానే ట్రోల్ చేసుకుంది. '' డైరెక్టడ్ బై రాబర్ట్ బి. వీడే '' అని మీమ్ క్రియేట్ చేసి ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ మీమ్‌కు అర్థం ఏంటంటే.. ఎండింగ్ దారుణంగా ఉన్నప్పుడు ఈ మీమ్ ఉపయోగిస్తారు.. అంటే ఎక్కువగా ఫెయిల్యూర్ పదానికి ఈ మీమ్‌ను వాడుతుంటారు. రాజస్తాన్ ట్వీట్‌పై నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఈ రకమైన ఎండింగ్ చూస్తామని ఊహించి ఉండరు.. అందుకే ఈ మీమ్‌ను షేర్ చేశారు.. అంటూ కామెంట్లు పెట్టారు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఒకదశలో బెంగళూరు బౌలర్ సిరాజ్ (3/27) ధాటికి 43/4తో కష్టాల్లో ఉన్న రాజస్తాన్‌ను శివమ్ దూబే (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ తెవాటియా (23 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తమ వీరోచిత పోరాటంతో జట్టుకు భారీ స్కోరును అందించారు. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి సహకరించాడు. కాగా కోహ్లి ఇదే మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో 6వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.
చదవండి: పడిక్కల్‌కు సాయం చేసిన బట్లర్.. వీడియో వైరల్
16 కోట్ల ఆటగాడిపై ఒత్తిడి.. నేనైతే అంత ఇవ్వను!
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2021
Comments
Please login to add a commentAdd a comment