
ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా సంజు శాంసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా గతేడాది ఐపీఎల్ సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. తాజాగా శాంసన్ తన కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినందుకు కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని నుంచి తనకు మెసేజ్‌లు వచ్చాయంటూ తెలిపాడు.
''కంగ్రాట్స్ శాంసన్.. కొత్త బాధ్యతతో ఐపీఎల్‌లో బరిలోకి దిగుతున్నావు.. ఆల్ ది బెస్ట్ అంటూ ముగ్గురు అభినందిస్తూ పర్సనల్‌గా సందేశాలు పంపారని'' తెలిపాడు. 2013 నుంచి రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కి ఆడుతూ ఉన్న సంజు శాంసన్.. ఆ జట్టుపై 2016-17లో నిషేధం పడటంతో.. ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 12న ముంబైలో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment