వైట్-బాల్ ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడంతో భారత క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. టీ20ల్లో ఇప్పటికే భారత కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టిన హిట్‌మ్యాన్.. తాజాగా వన్డే కెప్టెన్‌గా కూడా బాధ్యతలు స్వీకరించాడు. కాగా వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలగించి.. రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం చాలా మందికి షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షకుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. న్యూస్ 18 తో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టును విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్‌కు ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు 5 సార్లు టైటిల్‌ను రోహిత్ అందించాడని గంగూలీ కొనియాడాడు.
"భారత జట్టును విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్‌కు ఉంది. అందుకే సెలక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టు విజయాల కోసం రోహిత్ కొత్త వ్యూహాలు రచిస్తాడు. నాకు రోహిత్‌పై చాలా నమ్మకం ఉంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతని రికార్డు అద్భుతం... ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లను అతడు అందించాడు. అతను కోహ్లి గైర్హాజరీలో 2018లో ఆసియా కప్‌లో భారత జట్టు సారథ్యం వహించాడు. కోహ్లి లేకుండానే టీమిండియా ట్రోఫిని కైవసం చేసుకుంది. కోహ్లి లేకుండా టైటిల్ గెలిచి రోహిత్ తన సత్తా ఎంటో నిరూపించాడు" అని గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: IND Vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment