నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45), స్యామ్ కరన్ (38) రాణించారు. మోతీ, ఒషాన్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
వన్డేల్లో విండీస్‌కు ఇది రెండో అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. 39 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 214/5 వద్ద విండీస్‌కు విజయావకాశాలు తక్కువగా కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ పరిస్థితి మార్చింది. హోప్, షెఫర్డ్ ఆరో వికెట్‌కు 51 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సిన దశలో స్యామ్ కరన్ వేసిన ఓవర్లో హోప్ 3 సిక్సర్లు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో హోప్ 16వ సెంచరీ పూర్తయింది. చివరి 9.5 ఓవర్లలో విండీస్ 112 పరుగులు సాధించింది. మరోవైపు స్యామ్ కరన్ వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు (98) ఇచి్చన బౌలర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment