Sir Vivian Richards
-
డ్రెస్సింగ్ రూమ్ ‘బెస్ట్ ఫీల్డర్’గా సూర్య.. ఈసారి ‘గెస్ట్’ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి స్టార్ బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినందుకు సూర్యకు ఉత్తమ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వరించింది. కాగా ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి ఈ అవార్డు అందజేయడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అవార్డు అందజేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌ను భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తీసుకు వచ్చాడు. వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే భారత టీమ్ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీదగా సూర్య బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
వెస్టిండీస్ సంచలన విజయం
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షై హోప్ (83 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (72 బంతుల్లో 71; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...జాక్ క్రాలీ (48), ఫిల్ సాల్ట్ (45), స్యామ్ కరన్ (38) రాణించారు. మోతీ, ఒషాన్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 48.5 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసి విజయాన్నందుకుంది. వన్డేల్లో విండీస్‌కు ఇది రెండో అతి పెద్ద లక్ష్యఛేదన కావడం విశేషం. 39 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 214/5 వద్ద విండీస్‌కు విజయావకాశాలు తక్కువగా కనిపించాయి. అయితే రొమారియో షెఫర్డ్ (28 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ పరిస్థితి మార్చింది. హోప్, షెఫర్డ్ ఆరో వికెట్‌కు 51 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. చివరి 2 ఓవర్లలో 19 పరుగులు చేయాల్సిన దశలో స్యామ్ కరన్ వేసిన ఓవర్లో హోప్ 3 సిక్సర్లు బాది ఆట ముగించాడు. ఈ క్రమంలో వన్డేల్లో హోప్ 16వ సెంచరీ పూర్తయింది. చివరి 9.5 ఓవర్లలో విండీస్ 112 పరుగులు సాధించింది. మరోవైపు స్యామ్ కరన్ వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు (98) ఇచి్చన బౌలర్‌గా నిలిచాడు. -
విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!
నార్త్ సౌండ్(ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(200) వీర విహారానికి విండీస్ మాజీ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని రిచర్డ్స్ స్వయంగా వెల్లడించాడు. 'వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్డేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న సమయంలో భారత ఆటగాళ్లను నేను కలిశాను. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. అయితే ఈ విధంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని మాత్రం అసలు ఊహించలేదు' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు. బ్యాట్స్‌మన్ గా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఆస్వాదించానని, సంప్రదాయ షాట్లతో అలరించాడని కోహ్లీని కొనియాడాడు. తాను కూడా విండీస్ బయట తొలి డబుల్ సెంచరీ సాధించానని, ఇప్పుడు విరాట్ అదే పని చేసి చూపించాడని చెప్పాడు. నిజం చెప్పాలంటే విదేశాలలో ఆడుతున్నామంటే ఆటగాళ్ల మీద కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే ఏకాగ్రతతో ఏదైనా సాధ్యం చేయవచ్చని కోహ్లీ నిరూపించాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోయారు, నాకు అవకావం లేదు.. కోహ్లీ సెంచరీ చేయడం తొలిసారి చూశాను. అది కూడా ఏకంగా డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ అని విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తెలిపాడు. -
టీమిండియాకు సడన్ సర్ ప్రైజ్
ప్రస్తుతం వెస్డిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు వెస్డిండీస్ దిగ్గజ క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ సడన్ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. తమను కలిసేందుకు స్వయంగా రిచర్డ్స్ లాంటి దిగ్గజ ఆటగాడు రావడంతో భారత క్రికెటర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను సోమవారం కలవడంతో పాటు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. విండీస్ తో నాలుగు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైన టీమిండియా ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమతో విలువైన సమయాన్ని కేటాయించిన విండీస్ మాజీ ఆటగాడికి కోహ్లీ, రహానే, మురళీ విజయ్, రాహుల్, ధావన్, స్టూవర్ట్ బిన్నీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలను ప్రత్యేకంగా అభినందించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన విరాట్ ను మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నాడు. కూల్ గా ఉంటూనే తన బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించే రహానేను ప్రశంసించాడు. స్టూవర్ట్ బిన్నీతో మాట్లాడుతూ అతడి తండ్రి మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీతో పాటు 1983 ప్రపంచకప్ రోజులను రిచర్డ్స్ గుర్తుచేసుకున్నాడు.