
టీ20 వరల్డ్‌కప్-2024 సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్‌ను దాదాపుగా ఖారారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అయితే ప్రతీ మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్‌ను ఈసారి స్టార్ బ్యాటర్ సుర్యకుమార్ యాదవ్ దక్కించుకున్నాడు. సూపర్ 8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచినందుకు సూర్యకు ఉత్తమ ఫీల్డింగ్ మెడల్ అవార్డు వరించింది.
కాగా ప్రత్యేకంగా గెస్ట్‌ను పిలిచి ఈ అవార్డు అందజేయడం సాంప్రదాయకంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి అవార్డు అందజేసేందుకు వెస్టిండీస్ గ్రేట్ ,దిగ్గజ బ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్‌ను భారత ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ తీసుకు వచ్చాడు.
వివియన్ రిచర్డ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాగానే భారత టీమ్ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతించారు. వివియన్ రిచర్డ్స్ చేతుల మీదగా సూర్య బెస్ట్ ఫీల్డర్ అవార్డును అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment