విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..! | It was a classy double hundred, says Sir Viv Richards | Sakshi
Sakshi News home page

విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!

Published Sat, Jul 23 2016 12:36 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!

విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!

నార్త్ సౌండ్(ఆంటిగ్వా): వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(200) వీర విహారానికి విండీస్ మాజీ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని రిచర్డ్స్ స్వయంగా వెల్లడించాడు. 'వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్డేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న సమయంలో భారత ఆటగాళ్లను నేను కలిశాను. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. అయితే ఈ విధంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని మాత్రం అసలు ఊహించలేదు' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు.

బ్యాట్స్మన్ గా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఆస్వాదించానని, సంప్రదాయ షాట్లతో అలరించాడని కోహ్లీని కొనియాడాడు. తాను కూడా విండీస్ బయట తొలి డబుల్ సెంచరీ సాధించానని, ఇప్పుడు విరాట్ అదే పని చేసి చూపించాడని చెప్పాడు. నిజం చెప్పాలంటే విదేశాలలో ఆడుతున్నామంటే ఆటగాళ్ల మీద కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే ఏకాగ్రతతో ఏదైనా సాధ్యం చేయవచ్చని కోహ్లీ నిరూపించాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోయారు, నాకు అవకావం లేదు.. కోహ్లీ సెంచరీ చేయడం తొలిసారి చూశాను. అది కూడా ఏకంగా డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ అని విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement